పుష్ప విలన్‌కు భారీ రెమ్యునరేషన్.. అల్లు అర్జున్ నిర్మాతలు అస్సలు తగ్గట్లేదుగా

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా కోసం నిర్మాతలు ఏ మాత్రం తగ్గట్లేదు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ పై నమ్మకంతో అంచనాలకు మించి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా కోసం విలన్ గా నటించడానికి ఒప్పుకున్న మళయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 బడ్జెట్ పెరుగుతూనే ఉందట

బడ్జెట్ పెరుగుతూనే ఉందట

ఆర్య 2 సినిమా అనంతరం బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా అనగానే ఏదైనా లవ్ స్టోరీతో రావచ్చని అనుకున్నారు. కానీ ఊహలకందని రేంజ్ లో ఊర మాస్ కథను సెట్స్ పైకి తెచ్చారు. ఈ సినిమాను మొదట్లో వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటే ఆ తరువాత అంతకంతకు పెరిగింది.

నార్త్ లో భారీ డిమాండ్

నార్త్ లో భారీ డిమాండ్

దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. బన్నీ సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే గతంలో కేవలం యూ ట్యూబ్ వ్యూవ్స్ ద్వారా రికార్డును అందుకున్న బన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా నార్త్ థియేటర్స్ లోకి వెళ్లి బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. సినిమా ఆగస్ట్ 13న భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.

 విలన్ గా మలయాళం యాక్టర్

విలన్ గా మలయాళం యాక్టర్

ఇక సినిమాలో విలన్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇటీవల ముగింపు పలికారు. మొదట్లో విజయ్ సేతుపతి నుంచి హీరో విక్రమ్ వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. మొత్తానికి సినిమాకి విలన్ గా మళయాళం టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సెలెక్ట్ చేశారు.

రెమ్యునరేషన్ ఎంతంటే..

రెమ్యునరేషన్ ఎంతంటే..

40కి పైగా చిత్రాలలో నటించిన ఫహద్ జాతీయ చలనచిత్ర పురస్కారం, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఇక పుష్ప వినిమా కోసం ఈ నటుడు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మళయాళంలో బన్నీకి భారీగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక విలన్ ను ఆ ఇండస్ట్రీలో నుంచే తేవడంతో ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X