»   »  షాక్...ఇంతలోనే మరో నటుడు మృతి

షాక్...ఇంతలోనే మరో నటుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: మళయాల చిత్ర సీమకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇటీవల ప్రముఖ మళయాల నటుడు కళాభవన్ మణి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడు కన్నమూసారు. మళయాలం యాక్టర్ జిష్ణు రాఘవన్(35) క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం ఉదయం కొచ్చిలోని ఆసుపత్రిలో కన్నమూసారు.

ప్రముఖ మళయాల నటుడైన రాఘవన్ కుమారుడైన జిష్ణు రెండేళ్ల క్రితమే క్యాన్సర్ బారిన పడ్డారు. దీనికి ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ వ్యాధి నుండి ఆయన పూర్తిగా కోలుకున్నాడు. కానీ క్యాన్సర్ మళ్లీ తరగబెట్టడంతో పరిస్థితి తీవ్రం అయింది. జిష్ణు మరణంతో మళయాల చిత్రసీమ విషాదంలో మునిగి పోయింది.

Malayalam actor Jishnu Raghavan passes away

1987లో 'కిల్లిపట్టు' సినిమా ద్వారా బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టిన జిష్ణు చదువు పూర్తయిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'నమ్మాల్' మంచి విజయం సాధించింది. తర్వాత కూడా ఆయన సినిమాలు బాగా ఆడాయి. ధన్య రాజన్ ను వివాహమాడారు.

సినిమాలతో జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో క్యాన్సర్ మహమ్మారి ఆయన జీవితంలోకి ప్రవేశించి విషాదాన్ని నెలకొల్పింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విష్ణుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా ఆయన అభిమానులతో సోషల్ మీడయాలో టచ్ లో ఉండేవారని అంటున్నారు ఫ్యాన్స్.

English summary
Malayalam actor Jishnu Raghavan passed away at the age of 35 after prolonged battle with cancer. Jishnu passed away on Friday morning at a hospital in Kochi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu