»   » భారత్ చనిపోతుంటే...మనం బ్రతికి ఏం లాభం?... మోహన్ లాల్

భారత్ చనిపోతుంటే...మనం బ్రతికి ఏం లాభం?... మోహన్ లాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఢిల్లీలోని జవహరల్ లాల్ యూనివర్శిటీ‌లో జరుగుతున్న వివాదంపై ప్రముఖ మళయాల నటుడు మోహన్ లాల్ తనదైన రీతిలో స్పందించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై తన మనసులోని వేదనను ఆయన పర్సనల్ బ్లాగ్‌లో వ్యక్తపరిచారు. భారత దేశం చనిపోతుంటే మనం బ్రతికి ఉండి ఏం లాభమంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.

ఒకవైపు దేశ కోసం పోరాడే సైనికులు ప్రాణాలర్పిస్తుంటే.. మరో వైపు స్వేచ్ఛ, జాతీయవాదం గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. జాతి, స్వేచ్ఛ గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వాలని మోహన్‌లాల్ తన బ్లాగ్‌లో కోరారు. జాతీయ భద్రత గురించి దేశ పౌరులు ఆలోచించాలన్నారు. స్వేచ్ఛను గౌరవించాలని, కానీ దాని గురించి వాదించడం మానుకోవాలన్నారు.

Malayalam actor Mohanlal writes on the JNU controversy

సియాచిన్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది సైనికులు చనిపోయిన ఘటనను ఆయన గుర్తు చేస్తూ...లాన్స్ నాయక్ సుదీష్ భౌతిక కాయాన్ని ఆయన నాలుగేళ్ల కూతురికి చూపిస్తున్న ఫోటోను చూసి తాను చలించిపోయానని మోహన్ లాల్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ పౌరులు ఇంట్లో కూర్చుని స్వేచ్ఛ, జాతీయవాదాలపై వాదించుకోవడం సిగ్గుచేటన్నారు.

మనం ఇంట్లో కూర్చుని సకల సౌకర్యాలు అనుభవిస్తాం...కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లి సైనికుల గురించి మాట్లాడతాం, వారిని దుర్భాషలాడతాం, వారిని ప్రశ్నిస్తాం..... ఇలాంటివి మానుకోవాలని, సైనికులకు గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, తల్లి దండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు ఇవి నేర్పాలని ఆయన అభిప్రాయ పడ్డారు.

English summary
Malayalam superstar Mohanlal is an avid blogger and likes to express his thoughts on the current happenings in India. He has now written about the JNU issue that has taken India by storm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X