Actor Vinayakan: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జైలర్ విలన్ అరెస్టు.. అసలేం జరిగిందంటే?
Actor Vinayakan: సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ హిట్ చిత్రం జైలర్ లో విలన్ గా నటించిన మలయాళ సినీ నటుడు వినాయకన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వినాయకన్‌ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI)లో శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నటుడు వినాయకన్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయనను ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు.
ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. విమానాశ్రయం గేట్ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ దాడి జరిగిందనీ, ఈ దాడిలో నిందితుడైన నటుడు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు.
కొచ్చి నుండి ఇండిగో విమానంలో వచ్చి గోవాకు వెళ్లాల్సిన వినాయకన్ మద్యం తాగి విమానాశ్రయం గేట్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఇన్‌స్పెక్టర్ నివేదించారు. నటుడు వినాయకన్ పై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్ వినాయక్‌ను ఆర్‌జీఐ విమానాశ్రయ పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం వినాయకన్ ను అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలాఉంటే.. నటుడు వినాయకన్ మాత్రం మరోలా చెప్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎయిర్‌పోర్టు అధికారులే తనపై దాడి చేశారనీ, తనను కావాలనే ఇప్పటి పెడుతున్నారని అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ కూడా చెక్ చేసుకోవాలంటూ చెప్తున్నారు. నటుడు వినాయకన్ కొచ్చిలో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా వెళ్తున్నట్టు సమాచారం. అయితే..హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కోసం వినాయకన్ వెయిట్ చేస్తున్న సమయంలో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది.
జైలర్ విలన్ వినాయకన్ కు వివాదాలు కొత్త కాదు. గతేడాది అక్టోబర్ 23న తన దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయనను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఓ అపార్ట్ మెంట్ లో గొడవకు దిగాడు. దీంతో తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ వినాయకన్ పై అక్కడి . అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా అనుచితంగా ప్రవర్తించాడు. అప్పట్లో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ జైలర్ లో ఫేమస్ అయ్యాడు వినాయకన్. ఇందులో ఆయన పోషించిన
వర్మ పాత్రలో అద్భుతమైన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమా తర్వాత వినాయకన్ ను కంటే వర్మ అనే పేరుతోనే పిలుస్తున్నారు. అంతకాకుండే.. వినాయకన్ తన నటనకు అనేక ప్రశంసలు అందుకున్నాడు, 'మహశింటే ప్రతీకారం'లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. 'జైలర్, కమ్మట్టి పాదం, ఒరుతీ
సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.


Click it and Unblock the Notifications











