»   » అందరి ముందు దుస్తులు విప్పించాడు: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు

అందరి ముందు దుస్తులు విప్పించాడు: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరువనంతపురం: మళయాల దర్శకుడు స్నేహజిత్ మీద ఓ హీరోయిన్ ఫిర్యాదు చేసింది. షూటింగు పేరుతో అందరి ముందు తన దుస్తులు విప్పించారని, సినిమాలో ఇలాంటి సీన్ ఉంటుందని ముందుగా తనకు చెప్పలేదని, షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యుల ముందు బలవంతంగా దుస్తులు విప్పించారంటూ ఆమె ఫిర్యాదు చేసారు.

కేరళలోని తొడుపుళ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. త్రిశ్రూర్ ప్రాంతానికి చెందిన సరదు నటి స్నేహిజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దైవం సాక్షి అనే సినిమాలో నటిస్తోంది.

Malayalam Actress alleges that her clothes were ripped off during shoot

సినిమాకు సైన్ చేసే సమయంలో ఇందులో ఇలాంటి ఒకటి ఉంటుందని తనకు చెప్పలేదని, తర్వాత తనను షూటింగ్ స్పాట్లో యూనిట్ సభ్యులు అందరి ముందు దుస్తులు విప్పించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళ కావడం, సెన్సిటివ్ కేసు కావడంతో హీరోయిన్ పేరును బయట పెట్టలేదు. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసకుని విచారణ చేస్తున్నారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ మలయాళ చిత్ర సీమలో చర్చనీయాంశం అయింది.

English summary
In a shocking incident, an actress filed a police complaint against director Snehajith alleging that her clothes were ripped off in front of everyone during the filming of Daivam Sakshi in Kerala's Thoduphuzha, ManoramaOnline reported.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu