»   » హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల్లో హీరో హస్తం, 30 లక్షల సుపారీ?

హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల్లో హీరో హస్తం, 30 లక్షల సుపారీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: రెండు మూడు రోజులుగా మళయాలం నటి (తెలుగులో మహాత్మ మూవీ హీరోయిన్) కిడ్నాప్, లైంగిక వేధింపుల ఇష్యూ సౌత్ సినీ పరిశ్రమ మొత్తాన్ని కదిలించింది. ఒక ప్రముఖ హీరోయిన్‌కు ఇలాంటి దారుణ సంఘటన ఎదురుకావడం అందరినీ ఆందోళనలో పడేయటంతో పాటు, తమ సేప్టీ విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేసింది.

ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, ఈ సంఘటన వెనక ప్రధాన నిందితుడుగా ఉన్న ఆ హీరోయిన్ మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా పోలీసుల ఇంటరాగేషన్లో పలు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ అదుపులో ఉన్న ముగ్గురినీ పోలీసులు తమదైన రీతిలో విచారించగా.... సునీల్ కుమార్ తమకు ఈ పని చేయమని రూ. 30 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలిపారట.

అంత డబ్బు ఎక్కడిది?

అంత డబ్బు ఎక్కడిది?

అయితే ఒక సాధారణ డ్రైవర్ రూ. 30 లక్షల భారీ మొత్తం ఇచ్చి ఈ క్రైమ్ ఎలా చేయించారనే విషయమై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఇంస్డ్రీకి చెందిన ప్రముఖుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

హీరో హస్తం ఉన్నట్లు అనుమానం?

హీరో హస్తం ఉన్నట్లు అనుమానం?

ఈ కేసులో మళయాల చిత్రపరిశ్రమకు చెందిన ఓ హీరోతో పాటు ఓ రాజకీయ నాయకుడికి చెందిన ఇద్దరు కుమారుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారట. గతంలో ఆ హీరోతో సదరు హీరోయిన్ వివాదం ఉందని, ఆమె కారణంగానే తన భార్యతో విడిపోవాల్సి వచ్చిందనే కోపంతో ఆ హీరో ఇదంతా చేయించాడని టాక్.

వివాదంలో

వివాదంలో

గతంలో ఓ వివాదంలో హీరోకు వ్యతిరేకంగా, అతడి భార్యకు సపోర్టుగా బాధిత హీరోయిన్ ఉండటంతో ఆమె మీద సదరు హీరో కక్ష పెంచుకున్నాడని టాక్.

అవకాశాలు రాకుండా చేసాడు

అవకాశాలు రాకుండా చేసాడు

ఆమె కక్షతో హీరోయిన్ కు పలు అవకాశాలు రాకుండా చేసాడని, ఆమె కెరీర్ స్పాయిల్ చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

English summary
The news of abduction of Malayalam actress in a moving car and alleged molestation, harassment of her has triggered a panic. Cops too took the issue seriously and probing the matter. It's reported that cops are suspecting the hand of a hero, two sons of a noted politician behind the act.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu