»   »  ఆ నీచులకు శిక్ష పడేవరకు...అంటూ హీరోయిన్ శపథం!

ఆ నీచులకు శిక్ష పడేవరకు...అంటూ హీరోయిన్ శపథం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తనపై లైంగిక దాడి ఘటన తర్వాత మళయాళం నటి(మహాత్మ హీరోయిన్) సంచలన నిర్ణయం తీసుకుంది. సంఘటనకు పాల్పడ్డ నీచులకు, తెర వెనక ఉండి వారితో ఈ పని చేయించిన వారికి శిక్ష పడే వరకు తాను సినిమాల్లో నటించబోనని శపథం చేసారు.

ఈ ఘటన జరుగడానికి ముందే ఆమె మళయాలం హీరో పృథ్వి‌రాజ్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన వెనక ఓ హీరోతో పాటు, రాజకీయ నాయకుల కుమారుల హస్తం ఉందని ప్రచారం ఉంది.

మరి ఈ ఘటనలో ఆమెకు న్యాయం జరుగుతుందా? ఘటనకు పాల్పడ్డ నిందితులతో పాటు తెర వెనక ఉండి ఈ పాపం చేయించిన వారికి శిక్ష పడుతుందా? అనేది చర్చనీయాంశం అయింది.

ఈ దారుణ ఘటన సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. దుండగులు ఆమెను కార్లో తిప్పుతూ అభ్యంగా వేధింపులకు గురి చేస్తూ అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసారు. రూ. 30 లక్షలు ఇస్తేనే ఆ ఫోటోలు, వీడియోలు బయట పెట్టకుండా ఉంటాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు ఆ వీడియోలను, ఫోటోలను రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా.....ఆమెపై రేప్ జరిగినట్లు మీడియాలో ప్రచారం జరుగడాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఖండించారు. ఆమెకు ఆల్రెడీ నిర్మాతతో ఎంగేజ్మెంట్ అయిందని, వచ్చే నెలలో వారు వివాహం చేసుకోబోతున్నారు. ఇదో బాధాకరమైన సంఘటన. ఆమెపై రేప్ జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తే ఆమెను చేసుకోబోయే వ్యక్తి మైండ్ సెట్ మారిపోవచ్చు. కానీ అతడు ఆమెకు అండగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. ముందుగా అనుకున్న ప్రకారమే పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉంది అని ప్రియ దర్శన్ చెప్పుకొచ్చారు.

ఈ సంఘటనతో సౌత్ సినీ పరిశ్రమ మొత్తం ఉలికి పడింది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఆమెకు అండగా నిలిచారు. అన్ని వర్గాల నుండి ఒత్తిడితో ఈ కేసును కేరళ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు వెనక ఉన్న అసలు నిందితులను వెలికితీసేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఓ టీవీ ఛానల్ బయట పెట్టిన వివరాల ప్రకారం....ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో వివరాలు పరిశీలిస్తే సదరు హీరోయిన్ మీద దుండగులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు.

 షూటింగ్‌ ముగించుకొని వెలుతుండగా

షూటింగ్‌ ముగించుకొని వెలుతుండగా

త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్‌ ముగించుకొని బాధిత నటి సాయంత్రం ఏడు గంటలకు తన వాహనంలో కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి బయలుదేరింది.

 ఎస్సెమ్మెస్‌లు పంపాడు

ఎస్సెమ్మెస్‌లు పంపాడు

నటి కారు బయల్దేరగానే కారు డ్రైవర్‌ మార్టిన్‌ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్‌ ఇచ్చిన సమాచారంతో పల్సర్‌ సునిల్ గ్యాంగ్‌ క్యాటరింగ్‌ వ్యాన్‌లో ఆమెను ఫాలో అయ్యారు.

 పల్సర్ సునీల్ గ్యాంగ్ ఆమె కారును కావాలని ఢీ కొట్టి

పల్సర్ సునీల్ గ్యాంగ్ ఆమె కారును కావాలని ఢీ కొట్టి

రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌ వద్దకు ఆమె వావానం రాగానే పల్సర్ సునీల్ గ్యాంగ్ ఆమె కారును కావాలని ఢీ కొట్టి ఫేక్ యాక్సిడెంట్ చేసారు. కారు ఆగగానే ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి తమ చేతులతో ఆమె నోటిని మూసారు. కేకలు వేయొద్దంటూ బెదిరించారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు.

 కార్లోకి ప్రవేశిస్తూ

కార్లోకి ప్రవేశిస్తూ

ఆమె ఫోన్ లాక్కున్న తర్వాత కారు కొంత దూరం ముందుకు తీసుకెళ్లారు. ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్‌ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు.

 ముఖానికి టవల్‌ కట్టుకొని

ముఖానికి టవల్‌ కట్టుకొని

కారు కొంతదూరం వెళ్లనిచ్చిన తర్వాత ఓ ఇంటి వద్ద ఆగింది. అక్కడ పల్సర్‌ సునిల్ ముఖానికి టవల్‌ కట్టుకొని వచ్చి డ్రైవర్‌ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్‌ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్‌ వ్యాన్‌లోకి ఎక్కాడు.

 థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని

థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని

పల్సర్‌ సునిల్ అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటిని బెరించాడు. ఆమెను అశ్లీలంగా ఫోటోలు, వీడియోలు తీసిన తర్వాత కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి ఆమెను బయటకు తోసారు.

 కార్లో తిప్పుతూ ఈ అమానుషానికి పాల్పడ్డారు

కార్లో తిప్పుతూ ఈ అమానుషానికి పాల్పడ్డారు

దాదాపు రెండున్నర గంటల పాటు నటిని కార్లో తిప్పుతూ ఈ అమానుషానికి పాల్పడ్డారు. తమ ప్రయత్నాన్ని ప్రతిగటిస్తే మత్తు మందు ఇస్తామని ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ రాక్షస కిరాయి మూక నటి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు.

 పగతో

పగతో

నటిపై వ్యక్తిగత కక్షతోనే ఆమె మాజీ డ్రైవర్ సునీల్, ప్రస్తత డ్రైవర్ మార్టిన్ ను అడ్డం పెట్టుకుని మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిపైనే అందరికీ అనుమానం ఉంది. విచారణ అనంతరం పోలీసులు అతడిని సాక్ష్యాలతో అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Malayalam actress, who was recently kidnapped and molested, has reportedly vowed not to act in films until the culprits get severe punishment. The actress was supposed to act in a new film alongside Malayalam actor Prithviraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu