twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లూసిఫర్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు.. గుంపులో దారుణంగా!

    |

    సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు సినీ నటులకు ఎదురయ్యే చేదు అనుభవాలు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. సినిమాల కోసం బాహ్య ప్రపంచంలోకి వెళ్లే సినీ తారలు ఒక్కసారిగా అదుపుతప్పి తొందరపడిన వారిపై సీరియస్ కూడా అవుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా ఒక హీరోయిన్ కూడా ఒక యువకుడు చేసిన తప్పుకు చాలా సీరియస్ అయిపోయింది. గుంపులో అతను చేసిన తప్పిదాన్ని అప్పుడే కనిపెట్టిడమే కాకుండా చెంప పగలగొట్టే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

    సినిమా ప్రమోషన్స్ కోసం

    సినిమా ప్రమోషన్స్ కోసం

    సినిమా ప్రమోషన్స్ అనేవి ఇటీవల కాలంలో ఎంత ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం టెలివిజన్ సోషల్ మీడియాలోనే కాకుండా జనాల మధ్యలోకి వెళ్లి కొన్ని సినిమాలను ప్రమోట్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో సినీ తారలు ఫ్యాన్స్ ను కలుసుకునే క్రమంలో ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక కొన్నిసార్లు వాళ్ళు సహనం కూడా కోల్పోవాల్సి వస్తోంది.

    చెడుగా ప్రవర్తించడంతో

    చెడుగా ప్రవర్తించడంతో

    ఇక రీసెంట్ గా ఒక మలయాళం నటి కూడా కొంతమంది అభిమానుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక వ్యక్తి అయితే ఏకంగా చెడుగా ప్రవర్తించడంతో వెంటనే రియాక్ట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు లూసిఫర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన సానియా అయ్యప్పన్.

    మాల్ లో ప్రమోషన్స్

    మాల్ లో ప్రమోషన్స్

    సానియా అయ్యప్పన్ నటించిన సాటర్డే నైట్ అనే సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వాళ్ళు కేరళలోని హైలెట్ అనే మాల్ లో ప్రచారాలు చేశారు. ఆ ప్రమోషన్ లోకి సినీ తారలు వస్తున్నారు అని తెలియగానే చాలామంది కుర్రాళ్ళు ఎగబడి వచ్చారు. ఇక ఆ ఈవెంట్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

    జనసాంద్రత ఎక్కువ కావడంతో

    జనసాంద్రత ఎక్కువ కావడంతో

    అయితే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయే క్రమంలో మాత్రం వారికి ఊహించిన విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటికే బాడీగార్డ్స్ చాలా బలంగా సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా జనసాంద్రత ఎక్కువ కావడంతో నటీనటులు బయటికి వెళ్లిపోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఒక కుర్రాడు అయితే సానియా అయ్యప్పన్ పక్క ఉన్న మరో నటిమని తప్పుగా తాకడంతో ఆమె చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది.

    చెంప పగలగొట్టేలా..

    గుంపులో అతను తోటి నటిమనితో తప్పుగా ప్రవర్తించాడని అసభ్యకరంగా ఎక్కడపడితే అక్కడ టచ్ చేయడానికి ప్రయత్నించినట్లుగా అనిపించడంతో సానియా వెంటనే రియాక్ట్ అయ్యింది. గుంపులో ఉన్నప్పటికీ అతన్ని అప్పుడే కనిపెట్టి చంప పగలగొట్టే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో గత రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక వెంటనే ఆమె ఆ విషయంపై జరిగిన పొరపాటుపై సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చింది.

    English summary
    Malayalam actress saniya ayyappan serious reaction on misbehaving
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X