»   » అసభ్యంగా అక్కడ తాకాడు.. రైల్లో హీరోయిన్‌కు లైంగిక వేధింపులు

అసభ్యంగా అక్కడ తాకాడు.. రైల్లో హీరోయిన్‌కు లైంగిక వేధింపులు

Subscribe to Filmibeat Telugu
హీరోయిన్‌కు లైంగిక వేధింపులు,మరో హీరోయిన్‌ ని కోరిక తీర్చమని డబ్బులు ఆశ

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లంటే చాలామంది బయటి వ్యక్తులకు చిన్న చూపు. డబ్బు కోసం ఏమైనా చేస్తారనే చులకన భావం. తాజాగా అమలాపాల్ విషయంలో ఇదే జరిగింది. డ్యాన్స్ స్కూల్లో రిహార్సల్స్ చేస్తున్న ఓ సమయంలో ఓ ప్రబుద్దుడు ఆమె పట్ల అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మరువకముందే మరో హీరోయిన్ కూడా లైంగిక వేధింపులకు గురవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది..

 సనూషాకి లైంగిక వేధింపులు:

సనూషాకి లైంగిక వేధింపులు:

మలయాళ నటి సనూష రైల్లో ప్రయాణిస్తుండగా లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బుధవారం రాత్రి కున్నూర్‌ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్‌ అనే వ్యక్తి నిద్రిస్తున్న తనపై లైంగిక వేధిపులకు పాల్పడినట్లు సనూషా తెలిపారు.

 అక్కడ అసభ్యంగా తాకి..:

అక్కడ అసభ్యంగా తాకి..:

త్రిసూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం సనూషా మీడియాతో మాట్లాడారు. 'నేను నా బెర్త్ పై పడుకుని ఉన్న సమయంలో.. ఎవరో నా పెదాల్ని తాకినట్లుగా అనిపించింది. తలతిప్పి చూసేసరికి.. ముందు బెర్త్ లో ఉన్న వ్యక్తి అసభ్యంగా తన పెదాల్ని తాకుతున్నట్లు అర్థమైంది. వెంటనే రైల్లో లైట్ ఆన్ చేసి.. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను ' అని సనూషా చెప్పారు.

 చాలా బాధనిపించింది:

చాలా బాధనిపించింది:

సంఘటన జరిగిన సమయంలో.. కేవలం ఇద్దరు వ్యక్తులు, రచయిత ఉన్ని మాత్రమే తనకు అండగా నిలబడ్డారని, చాలామంది మహిళలు నేను అరుస్తున్నా పట్టించుకోలేదని అన్నారు. దీన్ని పెద్ద గొడవ చేయవద్దని నిందితుడు తనను బ్రతిమాలాడాని, కానీ అతను చేసిన పనికి నేను వెనక్కి తగ్గదలుచుకోలేదని చెప్పారు.సంఘటన తర్వాత పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.

 సంఘటన జరిగినప్పుడే స్పందించాలి..:

సంఘటన జరిగినప్పుడే స్పందించాలి..:

ఈరోజుల్లో సోషల్ మీడియాలో మాత్రమే అందరూ ఎక్కువగా స్పందిస్తున్నారని, కానీ సంఘటన జరిగిన చోట ఎవరి నుంచి స్పందన ఉండటం లేదని సనూషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చట్టబద్దంగా ఎలా వ్యవహరించాలో తనకు తెలుసు అని, తన ఫ్యామిలీ అంతా తనకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.

 అమ్మాయిలకు ఇదే నా సలహా..:

అమ్మాయిలకు ఇదే నా సలహా..:

అమ్మాయిలందరికీ తానొక సలహా ఇవ్వదలుచుకున్నానని, సంఘటన జరిగిన వెంటనే స్పందించాలి తప్ప వాయిదా వేస్తూ పోకూడదని అన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సనూషా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించారు.

 పోలీసులు ఏమన్నారు..:

పోలీసులు ఏమన్నారు..:

నిందితుడు(40) తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును త్రిసూర్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అటాచ్ చేస్తున్నట్లు చెప్పారు.

English summary
A man from Tamil Nadu has been arrested for groping upcoming Malayalam actress Sanusha when she was travelling in a train on Wednesday night, police said. Speaking to IANS a police officer, attached to the special branch police in Thrissur said the arrested person hails from Kanyakumari in Tamil Nadu and is over 40-years-old.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu