»   » దమారం: స్టేజీపైకి తాగి వచ్చి...రచ్చ రచ్చ చేసింది

దమారం: స్టేజీపైకి తాగి వచ్చి...రచ్చ రచ్చ చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రతిభాశాలి, నేషనల్ అవార్డు విన్నర్ ఊర్వసి గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ మళయాళ నటి తెలుగు,తమిళ భాషల సినిమాలు ఎన్నిటిలోనే నటించింది. అంతెందుకు... క్రిందటి నెలలో రిలీజ్ అయిన గోపించంద్ జిల్ సినిమాలో గోపీచంద్ కి తల్లి పాత్రలో నటించింది. ఇప్పుడామె తాగి...అంతటా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ కి ఊర్వశి తాగేసి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Urvashi

పూర్తి వివరాల్లోకి వెళితే..

రీసెంట్ గా...ఎల్.డి.ఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేగిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ కి ఊర్వశి హాజరు కావాలి. ఈమె ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే కాకుండా, స్టేజ్ మీదకి కూడా తూగుతూ, తూలుతూ వెళ్ళింది. అంతే కాకుండా స్టేజ్ మీద మాట్లాడడం కూడా సరిగా లేదు.

తనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసింది. దాంతో ఆ మీటింగ్ కాస్త డిస్టర్బ్ అయ్యింది. ఊర్వశి ఇలా పబ్లిక్ ఈవెంట్ లో మందు తాగి మత్తులో బిహేవ్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో తన విడాకుల కేసు హియరింగ్ కి ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టుకు తాగి వచ్చింది.

English summary
Urvashi, has allegedly created disturbance on the dais of an assembly event.However, this is not the first time that Urvashi has been seen drunk in public. She had also came drunk to the family court in Ernakulam when she was getting her divorce.
Please Wait while comments are loading...