ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ దర్శకుడు దిఫాన్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోచీలో మరణించారు. ప్రముఖ హీరో పృథ్వీరాజ్ హీరోగా దిఫాన్ దర్శకత్వం వహించిన పుథియా ముఖం అనే చిత్రం భారీ విజయం సాధిం
ప్రముఖ మలయాళ దర్శకుడు దిఫాన్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోచీలో మరణించారు. ప్రముఖ హీరో పృథ్వీరాజ్ హీరోగా దిఫాన్ దర్శకత్వం వహించిన పుథియా ముఖం అనే చిత్రం భారీ విజయం సాధించింది. గత మూడు నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురైన దిఫాన్ కోచిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారని మలయాళ సినీ ప్రముఖులు వెల్లడించారు.
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న హాస్పిటల్ చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో న్యుమోనియా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తన కెరీర్‌లో మొత్తం ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2003లో ది కింగ్ మేకర్: లీడర్, 2009తో పుథియా ముఖం, 2012లో హీరో, సిమ్, డాల్ఫిన్ బార్ చిత్రాలను నిర్మించారు. బీజేపీ ఎంపీ సురేశ్ గోపి నటించిన డాల్పిన్ బార్ చిత్రం భారీ విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











