twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత

    ప్రముఖ మలయాళ దర్శకుడు దిఫాన్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోచీలో మరణించారు. ప్రముఖ హీరో పృథ్వీరాజ్ హీరోగా దిఫాన్ దర్శకత్వం వహించిన పుథియా ముఖం అనే చిత్రం భారీ విజయం సాధిం

    By Rajababu
    |

    ప్రముఖ మలయాళ దర్శకుడు దిఫాన్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోచీలో మరణించారు. ప్రముఖ హీరో పృథ్వీరాజ్ హీరోగా దిఫాన్ దర్శకత్వం వహించిన పుథియా ముఖం అనే చిత్రం భారీ విజయం సాధించింది. గత మూడు నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురైన దిఫాన్ కోచిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారని మలయాళ సినీ ప్రముఖులు వెల్లడించారు.

    కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 26న హాస్పిటల్ చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో న్యుమోనియా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    Malayalam director Diphan dies in Kochi

    తన కెరీర్‌లో మొత్తం ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2003లో ది కింగ్ మేకర్: లీడర్, 2009తో పుథియా ముఖం, 2012లో హీరో, సిమ్, డాల్ఫిన్ బార్ చిత్రాలను నిర్మించారు. బీజేపీ ఎంపీ సురేశ్ గోపి నటించిన డాల్పిన్ బార్‌ చిత్రం భారీ విజయం సాధించింది.

    English summary
    Malayalam film director Diphan passed away in Kochi on Monday. The 47-year-old director, known for his hit film Puthiya Mukham. He then directed three films in 2012 which included Hero, SIM and his last was Dolphin Bar in 2014 which featured actor and BJP Rajya Sabha member Suresh Gopi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X