Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలుగులో ‘రతి నిర్వేదం’
మలయాళంలో రూపొందిన 'రతి నిర్వేదం" సినిమా త్వరలో తెలుగులో అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'తనకు తెలియకుండానే తనకన్నా పెద్దదయిన అమ్మాయి ఆకర్షణకులోనైన అబ్బాయి, తనకన్నా చిన్నవాడి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక సతమతమయ్యే అమ్మాయి...ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. అబ్బాయి పాత్రలో శ్రీజిత్ నటించగా, అమ్మాయి పాత్రను శ్వేతామీనన్ పోషించారు. ఈ చిత్రానికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే మళయాలంలో విడుదలై మంచి విజయం సాధించింది.
యస్.వి.ఆర్.మీడియా సంస్థ 'రతినిర్వేదం" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా విషయమై నిర్మాత శోభారాణి మాట్లాడుతూ...'ప్రముఖ రచయిత కీ॥ పి.పద్మరాజన్ రచన ఆధారంగా తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం 'రతినిర్వేదం". 1978లో జయభారతి నటించగా 'రతినిర్వేదం" పేరుతో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా అనువాద హక్కుల కోసం ఎంతో పోటీ వున్నా తమిళ, తెలుగు అనువాద హక్కుల్ని మా సంస్థ సొంతం చేసుకుంది" అన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్య్రకమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.