సెల్ లో మహిళా నేత నగ్న చిత్రాలు

By Staff

Elizabeth Wong
సెల్ ఫోన్స్ లో మహిళల నగ్న చిత్రాలు దర్శనమివ్వటం కొత్త కాదు. ఇప్పటివరకూ సినీతారలు, సెలబ్రిటీలు, మోడల్స్ నగ్న చిత్రాలు మాత్రమే రాజ్యమేలాయి. ఇప్పుడు తాజాగా మహిళా రాజకీయనాయకురాళ్ళని కూడా చేర్చాల్సని పరిస్ధితి ఏర్పడింది. తాజాగా మలేషియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన నగ్నచిత్రాలు మొబైల్‌ ఫోన్‌లలో కనిపించడంతో మలేసియాలో విపక్షపార్టీకి చెందిన శాసన సభ్యురాలు ఎలిజబెత్‌ వాంగ్‌ రాజీనామా చేశారు. ఆమె ప్రముఖ రాజకీయ వేత్త, మానవ హక్కుల కార్యకర్తల్లో అగ్రగణ్యురాలు. మహిళా హక్కుల కోసం కృషి చేస్తున్న ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఎలాంటి అచ్చాదనా లేకుండా బెడ్ పై ఆమె నిద్రిస్తున్న సమయంలో తీసిన ఈ చిత్రం మలేషియాలోని దాదాపు అన్ని సెల్ ఫోన్స్ లో దర్శనమివ్వటంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. అయితే అక్కడ పత్రికలు ఆ ఫొటోలను ప్రచురించకపోవటం గొప్ప విషయం. వాంగ్‌ నగ్నంగా నిద్రిస్తున్న సమయంలో తీసిన ఫొటోలను దుండగులు మొబైల్‌ ఫోన్లకు పంపించారని సమాచారం. దీంట్లో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌దే ప్రధానపాత్రని మీడియా పేర్కొంది. ఈ ఫొటోలను మాత్రం అక్కడి పత్రికలు ప్రచురించలేదు. వాంగ్‌ ప్రస్తుతం సెలంగర్‌ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌, బకిట్‌ లాంజన్‌ అసెంబ్లీ సభ్యురాలుగాను వ్యవహరిస్తున్నారు. నగ్నచిత్రాల వివాదం నేపథ్యంలో ఆమె తన రెండు పదవులను విడిచిపెట్టారు.

నేను ఎలాంటి తప్పూ చేయలేదు. చట్టాల్ని ఉల్లంగించలేదు. ప్రాధమిక సూత్రాలకు బద్దురాల్ని. లైంగికపరంగా నేను మహిళలను అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడటం లేదు. పైగా నేను ఒంటరిదాన్ని. ఏకాంత సమయంలో నచ్చినట్లు ఉండటం ప్రతి ఒక్కర హక్కు అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తనను, తన పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు జరిగిన కుట్రే ఇదని ఆమె విమర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X