»   » ఇంకో లీక్ : యూ ట్యూబ్ లో వచ్చేసింది...దర్శకుడు పోలీస్ కంప్లైంట్

ఇంకో లీక్ : యూ ట్యూబ్ లో వచ్చేసింది...దర్శకుడు పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : విడుదలకు ముందే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ ,యూ ట్యూబ్ లోనూ చిత్రానికి సంభందించిన వీడియోలు, పాటలు లీక్ అయ్యి కనిపించటం ఇండస్ట్రీకీ తలనొప్పిగా మారింది. రీసెంట్ గా తెలుగులో బాహుబలి చిత్రానికి జరిగినట్లే కన్నడంలోనూ ఓ చిత్రానికి ఈ లీక్ ఎఫెక్టు తగిలింది. త్వరలో విడుదలకు సిద్ధమైన కన్నడ చిత్రం మళె చిత్రంలోని ఆరు పాటలు యూట్యూబ్‌లో సైర్వ విహారం చేస్తున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ పాటలను త్వరలో హాసన్‌లో విడుదల చేయాలని చిత్ర దర్శకుడు ఆర్‌.చంద్ర ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈలోగా యూట్యూబ్‌లో ఆ పాటల్ని వీక్షించిన కొందరు ఈ విషయాన్ని చంద్రుకు ఫోన్‌ చేసి తమ అభినందనలు తెలిపారు. పాటలు అత్యద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు. పాటల్ని విడుదల చేయకముందే ఇవి యూట్యూబ్‌లో రావటంతో చంద్రు కంగుతిన్నారు.


'Male' Kannada movie songs leaded in You tube

ఈ పాటల లీకుకు కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్‌ ఠాణా పోలీసులను కోరనున్నట్లు తనను కలుసుకున్న మీడియాకు ఆయన తెలిపారు. ఇక ఈ దర్శకుడు చంద్రు తెలుగులోనూ ఓ చిత్రం రీసెంట్ గా డైరక్ట్ చేసారు. సుధీర్ బాబు, నందిత కాంబినేషన్ లో రూపొందిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రానికి చంద్రునే దర్శకుడు కావటం విశేషం.


‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' విశేషాలకు వస్తే...


సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష, శ్రీధర్‌ నిర్మించారు. హరి స్వరాలు సమకూర్చారు. కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని గీతాలు విజయవాడలో విడుదలయ్యాయి.


మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్‌ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


'Male' Kannada movie songs leaded in You tube

నిర్మాత ల‌గ‌డ‌పాటి శిరీష శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ.... ఇప్పటి వ‌ర‌కు ఎన్నో ప్రేమ క‌థా చిత్రాలు వ‌చ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాల‌ని త‌ల‌పెట్టాము.. దాని ఫ‌లిత‌మే ఈ కృష్ణమ్మ క‌లిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వ‌ల‌సి వ‌స్తే గ‌తంలో తెలుగు లో వ‌చ్చిన మ‌రో చ‌రిత్ర హిందీలో వ‌చ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర ద‌ర్శకుడు చంద్రు క‌న్నడంలో ఎంతో పేరు ఉన్న ద‌ర్శకుడు.. అత‌డు అక్కడ వ‌ర‌స విజ‌యాల‌ను అందించాడు.


ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వ‌ల‌సి వ‌స్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే ప‌దంత‌లు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని వారు చేస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శకుడు హ‌రి ఎ.ఆర్‌. రెహ‌మాన్ అంత‌టి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం ప‌రంగా సినిమా ప‌రంగా ప్రేక్షకులను అల‌రిస్తుంద‌నే నమ్మకం మాకు ఉంది. మా బేన‌ర్ స్థాపించి ప‌దేండ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా మంచి విజ‌యాన్ని సంపాదించి పెడుతుంద‌ని ఆశిస్తున్నాము అన్నారు.


సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన ‘చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఈ చిత్రాన్ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి చిత్రాన్ని నిర్మించాలనుకున్నానని, ప్రేమకథాచిత్రమ్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో చక్కని ప్రేమకథ ఉందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.


దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో తానీ చిత్రాన్ని ఒప్పుకున్నానని, సినిమా ప్రతీ ప్రేక్షకుడికి నచ్చుతుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమా చూసి తమ పాత రోజులు గుర్తుచేసుకుంటారని హీరో సుధీర్‌బాబు తెలిపారు.


కన్నడంలో పెద్ద చిత్రాలమధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందని, కథకు తగిన విధంగా పేరును కూడా నిర్ణయించామని దర్శకుడు చంద్రు అన్నారు.


గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు: ఖధీర్‌బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్, సంగీతం: హరి, నిర్మాత: శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.

English summary
Kannada Film 'Male' songs leaked in You tube. Director R Chandru lauding the team effort says we have spent more than Rs.3 crores on this film. He is quite busy in directing a Telugu film ‘Krishnam Pilichindi’ a Kannada remake of ‘Charminar’ film. Jassie Gift has composed six melodious songs and sung one song for the first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu