మహేష్, చరణ్ తర్వాత....నిత్యా మీనన్!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన '1 నేనొక్కడినే', 'ఎవడు' చిత్రాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు విడుదలైన రెండు వారాల గ్యాప్‌తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది హీరోయిన్ నిత్యా మీనన్. ఆమె నటించిన 'మాలిని 22' చిత్రం జనవరి 24వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిత్యామీనన్, క్రిష్ సత్తార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మాలిని 22'. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రాజ్‌కుమార్ సేతుపతి ఈ సినిమాను నిర్మించారు. అరవింద్, శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. రివేంజ్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలోనూ ఒకేసారి విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ "శ్రీప్రియగారు కథ చెప్పినప్పుడు చేయడం కష్టమనిపించినా ఒప్పుకున్నాను. పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాలో నటించిన మేల్ ఆర్టిస్టులకు స్పెషల్ థాంక్స్'' అని చెప్పారు. 22 కొట్టాయం కథను తెలుగు, తమిళ భాషలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి నిర్మించిన ఈ సినిమాలో ఓ గొప్ప సందేశం ఉంటుందని దర్శకురాలు శ్రీప్రియ సినిమాపై ఉన్న అభిరుచితో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కథానాయిక నిత్యామీనన్ తెలిపారు. సున్నితమైన అంశంతో తెరకెక్కిన సినిమా అని క్రిష్ తెలిపారు.
శ్రీప్రియ మాట్లాడుతూ "ప్రస్తుతం మన సమాజ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిత్య తన పాత్రలో లీనమై నటించింది. ఓ మంచి బలమైన సందేశం ఇచ్చే కథాంశంతో ఈ చిత్రం నిర్మించామని, మలయాళంలో హిట్ అయిన 'కొట్టాయం 22' చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన ఈ చిత్రం మహిళలకు, పురుషులకు సమానమైన సందేశాన్ని అందిస్తుందని, ఎక్కువగా మహిళలకే ఓ మోరల్ సపోర్ట్‌గా ఈ చిత్రం నిలుస్తుంది. నిత్యామీనన్ ఆలపించిన 2 పాటలు బావుంటాయి, రోజూ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక సమస్యలపై స్పందనగా ఈ చిత్రం నిలుస్తుంది. అరవింద్- శంకర్, అనంతశ్రీరామ్ కలిసి పాటలకు ప్రాణం పోశారు. '' అని తెలిపారు.
కోవైసరళ, కోట శ్రీనివాసరావు, విద్యురామన్, సూదుకవ్వమ్, అంజలిరావ్, హార్లిక్స్ అంకుల్, మురళి, చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రేమ్‌శ్రీనివాస్, మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతంకశ్యప్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సంగీతం: అరవింద్-శంకర్, ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్, కెమెరా: మనోజ్‌పిళ్లై, నిర్మాత: రాజ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ.


Click it and Unblock the Notifications












