Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మగధీర కు పోటీగా...
రామచరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్లో రానున్న మగధీరకు పోటీగా విక్రమ్ మల్లన్న నిలుస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో భారీ అంచనాలతో రానున్న ఈ చిత్రం ఓ సూపర్ హీరో కథ కావటం, హాలివుడ్ స్టాండర్డ్స్ తో దర్శకుడు సుశీ గణేషన్ రూపొందించటం జరిగిందంటున్నారు. అలాగే అపరిచితుడు అనంతరం హిట్టులు లేని విక్రమ్ కి లైఫ్ ఇచ్చే చిత్రంగా ప్రచారం కావటం జరుగుతోంది. అంతేగాక శ్రియ కూడా ఈ చిత్రంలో తన అందాలను కాస్త ఎక్కువ మొత్తంలోనే మోతాదు మించి ఆరబోసిందనే చెప్తున్నారు. వీటితో పాటు మల్లన్నలో హాలీవుడ్ సూపర్ హిట్స్ స్పైడర్ మ్యాన్, సూపర్ మేన్ తరహా ఎపిసోడ్స్ ఉంటాయంటున్నారు.అంతేగాక మగధీర చిత్రం లాగే మల్లన్న చిత్రానికి కూడా మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. ట్రేడ్ ఎంక్వైరీలు ఓ రేంజిలో జరిగి బయ్యర్లు మధ్య పోటీ వాతావరణం ఏర్పడిందని చెప్తున్నారు.
మగధీరలో హైలెట్ గా నిలిచే నాలుగు వందల సంవత్సరాల క్రిందట ఎపిసోడ్స్ హాలీవుడ్ చిత్రాలైన బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ స్ధాయిలో ఉంటాయంటున్నారు. ఈ రెండు చిత్రలలోనూ గ్రాఫిక్స్ ప్రధమ స్ధానం ఆక్రమించనుండటం మరో విశేషం. అలాగే రెగ్యులర్ బ్రాక్ డ్రాప్స్ కాకుండా కొత్త తరహా విజువల్స్ తో ఈ రెండు చిత్రాలు రూపొందాయి. మగధీరలో ధీర..ధీర పాట సూపర్ హిట్ అయితే మల్లన్నలో ఎక్సక్యూజ్ మి మిస్టర్ మల్లన్న అనే టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విక్రమ్ చిత్రాలకు గతంలో లభించిన విపరీతమైన ఆదరణ దృష్టిలో పెట్టుకుని మల్లన్న చిత్రాన్ని స్ట్రైయిట్ చిత్రంలాగే రిలీజ్ చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలా కొద్ది వారాలు తేడాలో ఈ రెండూ రిలీజైనా ఒకదానికొకటి పోటి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.