‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' విడుదల తేదీ

జక్కం జవహర్‌బాబు సమర్పణలో జి.ఉమాదేవి నిర్మించిన ఈ చిత్రంలో జూన్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ మనస్సును మించిన అందమైన ప్రపంచం ఏదీ లేదు. మనసుపెట్టి వెతికితే మన హృదయంలోనే అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించవచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్నారు.
యువతకు నచ్చే సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని నిర్మించామని, సినిమా చూస్తుంటే ఓ డైరీ చదువుతున్న అనుభవం ఎదురౌతుందని, ఓ యువతి జీవితంలో ప్రేమ తాలూకు అనేక అనుభవాల నేపధ్యంలో ఈ చిత్రాన్ని సరికొత్తగా నిర్మించే ప్రయత్నం చేశామని తెలిపారు.
జార్జి, రావురమేష్, సి.వి.ఎన్.రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి, సంగీతం: పవన్‌కుమార్, ఎడిటింగ్: ధరేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, నిర్మాత: ఉమాదేవి జి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.వి.రామరాజు.


Click it and Unblock the Notifications











