twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాజాన్ని చెడగొట్టే సినిమాలు తీయనని..(మల్లెమాల స్పెషల్)

    By Bojja Kumar
    |

    MS Reddy
    సుప్రసిద్ధ నిర్మాత, కవి, రచయిత యం.యస్ రెడ్డి(87) ఆదివారం కన్నుమూశారు. సోమవారం ఉదయం పంజాగుట్టలోని స్మశాన వాటికలో ఆయన తనయుడు శ్యాం ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మల్లెమాల అంత్యక్రియలు జరిగాయి.

    ఎం.ఎస్.రెడ్డి పూర్తిపేరు మల్లెమాల సుందరరామిరెడ్డి. స్వగ్రామం నెల్లూరు జిల్లా అలిమిలి. 1924వ సంవత్సరంలో ఆగస్ట్ 15న రంగమ్మ, రామస్వామిరెడ్డి దంపతులకు జన్మించారాయన. 1963లో ఎగ్జిబిటర్‌గా ఎం.ఎస్.రెడ్డి సినీ ప్రస్థానం మొదలైంది. 1966 సంవత్సరంలో డబ్బింగ్ చిత్రం 'కన్నెపిల్ల' ద్వారా నిర్మాతగా సినీ రంగంలో అడుగిడిన ఆయన కౌముది ఆర్ట్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి 'భార్య' అనే చిత్రాన్ని తొలిసారిగా నిర్మించారు. సినిమా అనేది వ్యాపారమైనా డబ్బు కోసం సినిమాలు తీసి సమాజాన్ని చెడగొట్టే నైతిక హక్కు నిర్మాతకు లేదంటూ... నీతివంతమైన సినిమాలు తీసి, తెలుగు చిత్ర యవనికపై విలువలు కలిగిన నిర్మాతగా తనదైన ముద్రను వేశారు ఎమ్మెస్‌రెడ్డి.

    తన ఇంటిపేరునే కలం పేరుగా చేసుకొని 'మల్లెమాల' పేరిట ఎన్నో రచనలు చేశారు ఎమ్మెస్. 'ముత్యాలపల్లకి'లో ''సన్నాజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది'', ''తెల్లావారకముందే పల్లె లేచింది'' పాటలు పెద్ద హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. 'తలంబ్రాలు'లో ''బుల్లిపాప కోరేది తల్లిపాలు, కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు'' పాట కూడా పెద్ద హిట్. ఇంకా పల్నాటిసింహం, పచ్చని సంసారం, అంకుశం, అమ్మోరు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. అలాగే ఆయన రాసిన 'మల్లెమాల రామాయణం' పుస్తకం పాఠకుల నుంచి విశేషఆదరణ పొందింది.

    ఇటీవల ఆయన రచించిన 'ఇది నా ఆత్మ కథ' పుస్తకం విడుదల కాకుండానే సంచలనం సృష్టించింది. ఈ ఆత్మకథలో చాలా మంది సినీయర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు సినీ హీరోలపై, దర్శకులపై ఆయన విమర్శలు చేశారు. తను సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ ఆయన ఆత్మకథలో ప్రస్తావించారు.

    సినీ పరిశ్రమకు ఎం.ఎస్.రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా 2005లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. నిర్మాతగానే కాకుండా సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఆయన పదవుల్ని నిర్వహించారు. తెలుగు నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ రచయితల సంఘం, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతల్ని నిర్వహించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై స్పందించి తనదైన శైలిల్లో వాటి పరిష్కారానికి పోరాటం చేశారు. సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి కృషి చేసిన వారిలో యం.యస్.డ్డి ఒకరు. ఆయన తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాల్ని రూపొందిస్తున్నారు.

    English summary
    Noted producer, lyricist and writer M S Reddy died here on Sunday. He was 87. Prominent figures of the Telugu film industry, politicians and others paid homage to Reddy at his residence at Filmnagar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X