twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండకు పోవాల్సిన 'మల్లేశం' ప్రియదర్శి చేతికి

    |

    అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి చింతకింది మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశంగారి సొంతం. ఇందుకు గాను ఆయనకు పద్మ శ్రీ అవార్డు కూడా లభించింది. ఇంతటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాజ్ మ‌ల్లేశం సినిమా తెరకెక్కించారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి లీడ్ రోల్ పోషించి భేష్ అనుపించుకున్నారు.

    రియాలిటీకి పెద్దపీట వేస్తూ పూర్తి తెలంగాణా పదజాలంతో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ వచ్చింది. చిత్రంలో ప్రియదర్శి నటన, డైరెక్టర్ రాజ్ టేకింగ్, మనసును హత్తుకునే స్వరాలు మంచి మార్కులు తెచ్చుకున్నాయి. ఇన్స్పిరబుల్ సినిమా, వావ్ వాట్ ఏ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ రాణి డిఫెరెంట్ మూవీ అంటూ ప్రేక్షకలోకంలో వాయిస్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

    Mallesham Movie Missed Vijay Deverakonda.. Director says

    అయితే తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన డైరెక్టర్ రాజ్.. ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. చింతకింది మల్లేశం గారి గురించి తెలుసుకున్నాక, ఆయనను కలుసుకుని తన ఆలోచనను పంచుకొని.. ఆయన పర్మిషన్ తో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని చెప్పాడు రాజ్. ముందుగా మల్లేశం పాత్ర కోసం హీరో నానీని గానీ, విజయ్ దేవరకొండని గానీ తీసుకుంటే బాగుంటుందని భావించాను కానీ మరో మూడేళ్ల వరకూ వాళ్ల కాల్షీట్స్ కాళీగా లేవని తెలిసి ప్రియదర్శిని తీసుకున్నానని చెప్పుకొచ్చాడు రాజ్. ప్రస్తుతం ప్రియదర్శి నటనపై, ఈ సినిమాకి వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే అంతులేని ఆనందం కలుగుతోందని ఆయన అన్నాడు.

    English summary
    Mallesham is a inspirable movie which is directed by Raj. In this movie Priyadarshi acts as Mallesham. On latest interview director raj says some intresting issues on this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X