For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను ప్రభుత్వంలో లేను.. కానీ మంత్రికి చెబుతా.. మల్లేశం సభలో కేటీఆర్ అదుర్స్

|

చేనత కళాకారులకు వరంగా మారిన అసు యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కే తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మల్లేశం సినిమా గురించి, చేనేత కళాకారుల సమస్యలను, వారికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఆయన వెల్లడించారు. సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకు కేటీఆర్ ఏమన్నారంటే..

మల్లేశం సినిమా భావోద్వేగంగా

మల్లేశం సినిమా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంటే.. ఆ సినిమా పూర్తి కావడం వెనుక ఉన్న ప్రతీ ఒక్కరికి నా అభినందనలు. మల్లేశం సినిమాను భావోద్వేగంగా, హృద్యంగా, సహజత్వానికి దగ్గరగా రూపొందించినందుకు చాలా థ్యాంక్స్. ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో అనే పాటను తన ప్రసంగంలో ఉదహరించారు. ఆ కవిత రెండున్నర గంటల సినిమాను, సామాన్యుడి జీవితాన్ని చెప్పడానికి చక్కగా సరిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

చేనేత కళ మరుగున పడుతున్న వేళ

దేశవ్యాప్తంగా చేనేత కళ మరుగున పడుతున్న నేపథ్యంలో మల్లేశం సినిమా వారి కష్టాలు, అవస్థలు, సమస్యలను చూపించింది. చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూపించింది. చేనేత కళాకారులు సమస్యలను అధిగమించేందుకు మల్లేశం సినిమా స్ఫూర్తిగా నిలుస్తుంది. అసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశంను అభినందించాలి. విషయంపై అవగాహన లేకపోయిన యంత్రాన్ని కనిపెట్టి ఎందరో తల్లులకు ఉపశమనం కలిగించాడు అని కేటీఆర్ తెలిపారు.

తల్లి కోసం అసు యంత్రం

మల్లేశం సినిమాలో ఎన్నో అంశాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. ఈ సినిమా చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుంది. necessity is the mother of invention అంటారు. కానీ ఈ సినిమాలో Mother is the necessity of invention అని చెప్పింది. సినిమాలో తన తల్లి పడే కష్టాన్ని చూసి అసు యంత్రాన్ని కనిపెట్టడానికి పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజు. తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని రచయిత పెద్దింటి అశోక్ అద్భుతంగా తెరపైన చూపించాడు. ప్రియదర్శి, అనన్యతోపాటు తల్లిగా ఝాన్సీ, తండ్రిగా చక్రపాణి అద్భుతంగా నటించారు అని కేటీఆర్ అన్నారు.

మల్లేశంకు ప్రభుత్వ సాయం అందించడానికి

మల్లేశం సినిమా కోసం ఇప్పటి వరకు దర్శకుడు రాజు ఏమీ అడుగలేదు. కానీ నా అంతట నేను ఓ మాట చెబుతున్నాను. ఈ సినిమాకు ప్రభుత్వం పరంగా ఏదైనా చేయాలని అనిపిస్తున్నది. ప్రభుత్వం నేను లేను కాబట్టి, సినిమాటోగ్రఫి మంత్రి శ్రీనివాసయాదవ్ లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సర్కార్ పరంగా సహాయం అందిస్తాను అని కేటీఆర్ తెలిపారు.

English summary
Mallesham pre release event organised Art gallery at Madhapur of Hyderabad. TRS working president KTR chief guest. His speech attracted every one in the auditorium. He promised to help for the movie from Telangana Governement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more