మల్లేశం ట్విట్టర్ రివ్యూ

అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని అబ్బురపరిచిన వ్యక్తి చింతకింది మల్లేశం. ఎన్నో విజయాలు సాధించి చేనేత దుస్తుల ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశం సొంతం. ఇందుకు గాను ఈయనకు పద్మ శ్రీ అవార్డు కూడా లభించింది. ఇంతటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాజ్ మ‌ల్లేశం సినిమా తెరకెక్కించారు. పూర్తి తెలంగాణ పదజాలంతో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు.

చిత్రంలో మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి నటించగా.. అన‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌క‌పాత్ర‌ల్లో నటించారు. ఈ రోజే (జూన్ 21న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకలోకం 'మల్లేశం' పై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అందులో కొన్ని..

అద్భుతం.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా మల్లేశం

మల్లేశం సినిమా స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా మల్లేశం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ప్రియదర్శి, చిత్ర యూనిట్ అంతా కలిసి ఓ అద్భుతం సృష్టించారు. ఇంత గొప్ప సినిమా అందించిన మీకు అభినందనల వెల్లువ కురవాల్సిందే. ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు. చూస్తాననే నమ్మకం లేదు.

ఇన్స్పైరబుల్ స్టోరీ.. మల్లేశం టీమ్‌కి అభినందనలు

మల్లేశం సినిమా ఓ ఇన్స్పైరబుల్ స్టోరీ లైన్ తో వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రియదర్శి కమెడియన్ కాదు బెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మల్లేశం టీమ్‌కి అభినందనలు.

నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ కదిలిపో

ఏ ఓటమంచున ఏ విజయం దాగిందో... ఏ విఫలయత్నాన ఏ గుణపాఠం మిగిలిందో... మిగిలిన దానితో శ్రమిస్తూ, దాగిన దానికోసం వెతుకుతూ... నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ కదిలిపో...#మల్లేశం. ప్రియదర్శి నటన అబ్బురపరిచింది.

ఆసక్తికరంగా సాగే కథనం.. వాట్ ఏ మూవీ

వాట్ ఏ మూవీ మల్లేశం. బ్రిలియంట్ పర్‌ఫార్‌మెన్స్. చిత్ర కథనాన్ని ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఇప్పటి వరకు చూసిన బెస్ట్ సినిమాల్లో దీన్ని మించిన సినిమా లేదు. ప్రతీ క్యారెక్టర్ లో జీవించేశారు నటీనటులు.

చీర నేసినంత అందంగా తీశారు

వాట్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం. చీర నేసినంత అందంగా తీశారు సినిమా ని. గౌరవించ దగిన వ్యక్తి మల్లేశం. ఆయన పడిన స్ట్రగుల్స్ బాగా చూపించారు. మల్లేశం.. సింపుల్, బ్యూటిఫుల్, ఇన్స్పిరేషనల్... ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.

ఝాన్సీ సూపర్.. తాగుబోతు రమేష్‌ని మిస్ కావొద్దు

మల్లేశం నిజంగా హృదయాన్ని హత్తుకునే సినిమా. ప్రియదర్శి తన క్యారెక్టర్ లో జీవించాడు. ఝాన్సీ సూపర్.. తాగుబోతు రమేష్‌ని మిస్ కావొద్దు. తప్పకుండా చూడండి.. మిస్ కావొద్దు.

విజయం నీ జేబులో ఉండదు.. కష్టపడాలి

మల్లేశం సినిమా ఇన్స్పైరబుల్. విజయం నీ జేబులో ఉండదు.. కష్టపడాలి అని చెబుతూ చాలా బాగా ఈ సినిమా రూపొందించారు. నటీనటులందరూ సూపర్‌గా నటించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన గ్రేట్ మూవీ

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన గ్రేట్ మూవీ మల్లేశం. నేటీనటులంతా నాచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. ఇది ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X