»   » ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ ఆడియో లాంచ్(ఫోటోలు)

‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ ఆడియో లాంచ్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హరిత ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై మల్లెల సీతారామరాజు-పిల్లాడి స్వాతి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'. '1 ఇయర్ మాత్రమే గ్యారంటీ' అనేది ఉప శీర్షిక. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, మనో చిత్ర జంటగా నిర్మిస్తున్న ఈచిత్రానికి ఉదయరాజు.ఎ దర్శకుడు.

యువ సంగీత దర్శకుడు రఘురాం స్వరాలు అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక గురువారం హైదరాబాద్ లోని విజయభేరి క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, దర్శకుడు వివి వినాయక్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎంఎల్ కుమార్ చౌదరి, వి. సాగర్, బెక్కెం వేణుగోపాల్, పోసాని కృష్ణ మురళి, తరుణ్, సిసిసి చైర్మన్ షఫి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, వివరాలు..

వివి వినాయక్

వివి వినాయక్


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వివి వినాయక్ ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో 'ఆడియో సీడీలను ఆవిష్కరించి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేసారు. అర్ధాంతరంగా వర్షం పడినప్పటికీ పలువురు ప్రముఖులు తడుస్తూనే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శ్రీకాంత్

శ్రీకాంత్


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...‘నేను చాలా రోజుల తర్వాత నటిస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెనర్ ఇది. దర్శకుడు ఉదయరాజు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. రఘురాం అందించిన బాణీలు బాగున్నాయి. వర్షం పడుతున్నప్పటికీ మా మీద అభిమానంతో ఈ ఆడియో వేడుకలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

నిర్మాతల

నిర్మాతల


ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించి...తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించాలని చిత్ర నిర్మాతలు మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి ఆకాక్షించారు.

తారాగణం, టెక్నీషియన్స్

తారాగణం, టెక్నీషియన్స్


బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రంగనాథ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: రఘురాం, ఛాయాగ్రహణం: వాసు, పాటలు : భాస్కరభట్ల, కళ: విజయకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాలాజీ శ్రీను, అక్కినేని శ్రీను, నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి, కథ-దర్శకత్వం: ఉదయరాజు.

English summary
Malligadu Marriage Bureau Movie Audio Launch Gallery. V V Vinayak, Posani Krishna Murali, Hero Srikanth, Anjana and others were attend this event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu