మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

By Bojja Kumar

కాన్స్ : బాలీవుడ్ హాట్ లేడీ మల్లికా షెరావత్ కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌లో వీలైనంతమేర పబ్లిసిటీ సంపాదించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ మీడియా ముందు తన గురించి బడాయి చెప్పుకుంటోంది. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ముద్దు సీన్లు, బికినీ సీన్లకు తానే ఆధ్యురాలిని అని ప్రచారం చేసుకుంటోంది.

ఇటీవల ఇంటర్నేషనల్ మీడియాతో మల్లికా షెరావత్ మాట్లాడుతూ..'ఇండియాలో వెండితెరపై ముద్దు సీన్లు, బికీనీలే వేసింది నేనే' అంటూ చెప్పుకుంది. మర్డర్ లాంటి సినిమాల్లో లిప్ లాక్ కిస్సింగ్ సీన్లను హాట్ హాట్‌గా పెర్ఫార్మ్ చేసి అలాంటి సీన్లుకు మల్లిక షెరావత్ బెంచ్ మార్క్ సృష్టించిన మాట వాస్తవమే కానీ....మొదటి వ్యక్తి మాత్రం ఆమె కాదు.

లిప్ లాక్ ముద్దు సీన్లు ఇప్పటికీ వెండితెరపై ఆశ్యర్యం గొలిపే అంశాలైనప్పటికీ, అవి బాలీవుడ్ పరిశ్రమకు కొత్తమీ కాదు. 1933లో....దేవికరాణి, ఆమె భర్త హిమాంషు రాయ్ 'కర్మ' సినిమాలో మొదటి సారి లిప్ లాక్ సీన్లో పాల్గొన్నారు.

బాలీవుడ్ చరిత్రలో ఈ తరం హీరోయిన్ల మాత్రమే ముద్దుకు, బికీనీ సీన్లకు కెరాఫ్ అడ్రస్ అని అనుకుంటే పొరపాటే. జీనత్ అమన్, ఫర్వీన్ బాబి, షర్మిలా ఠాగూర్ లాంటి అలనాటి హీరోయిన్లు అప్పట్లోనే బికినీలు, ముద్దు సీన్లతో సెన్సేషన్ సృష్టించారు. మరి ఈ విషయాలు మల్లికా షెరావత్‌‍కు తెలియవా? లేక నిజాలను కప్పి పుచ్చి అంతర్జాతీయంగా ఆ ఘనత తనకే దక్కాలని ఇలా చేస్తోందా?

పాత తరం సినిమాల్లోనే ముద్దు సీన్లు, బికినీ సీన్లు ఉన్నాయడానికి ఈ ఫోటోలే నిదర్శనం!

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

1929లో వచ్చిన A Throw of Dice అనే మూకీ చిత్రంలో సీతా దేవి చారు రాయ్‌తో ముద్దు సీన్

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

బికినీ వేసి మొదటి ఇండియన్ తారగా షర్మిలా ఠాగూర్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. మేగజైన్లపై తొలిసారిగా ఆమె బికినీ చిత్రాలు దర్శనం ఇచ్చాయి. అప్పట్లో ఈ విషయం పార్లమెంటులో కూడా చర్చనీయాంశం అయిందట.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

1920లో వచ్చిన పతి భక్తి అనే చిత్రంలో నటి లలితా పవార్ ముద్దు సీన్ చేసింది.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

వెండితెరపై డింపుల్ కపాడియా ఆరోజుల్లోనే 2 పీస్ బికినీలు వేసి అభిమానులకు అందాల విందు చేసింది.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

సత్యం శివం సుందరం చిత్రంలో జీనత్ అమన్, శశి కపూర్ ముద్దు సీన్ చేసారు.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

ఫర్వీన్ బాబిలో బ్లాక్ అండ్ వైడ్ సినిమా రోజుల్లోనే బికినీలో దర్శనం ఇచ్చి సెక్సీ ఫిగర్ గా పేరు తెచ్చుకుంది.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

టీనేజ్ డ్రామా సబ్జెక్టుతో వచ్చిన ‘బాబీ' చిత్రంలో రిషి కపూర్, డింపుల్ కపాడియా మధ్య ముద్దు సీన్ హాట్ ఆన్ స్ర్కీన్ ముద్దు సీన్‌గా పేరు తెచ్చుకుంది.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

1970ల్లో నటి జీనత్ అమన్ బికినీ అందాలు ఆరబోసి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

మాధురి దీక్షిత్-సంజయ్ దత్ మధ్య ముద్దు సీన్ బాలీవుడ్ ఎప్పటికీ మరిచిపోదు. అప్పట్లో అదో సెన్సేషన్

మల్లికా..! నీ కంటే ముందే వాళ్లు ముదుర్లు... (ఫోటోలు)

రాజా హిందుస్థానీ చిత్రంలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య ముద్దు అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X