మల్లికా షెరావత్ ఈ మధ్య ఒక యాడ్ ఫిలిమ్ కి రెమ్యునేషన్ గా మూడు కోట్ల యాభై లక్షలు తీసుకుంది. విషయం తెల్సిన బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యింది. వాస్తవానికి ఇండియన్ యాడ్ మార్కెట్లో ఈ మొత్తం చాలా ఎక్కువట. కొత్తగా మర్కెట్ లోకి ఎంటరవుతున్న ఓ సి.డి కంపెనీ ఇంత మొత్తం చెల్లించిందిట. ఈ విషయం తెల్సిన వాళ్ళు కంగారుగా ఈ 'మర్డర్' సుందరికి ఫోన్ చేసి "మేం విన్నది నిజమేనా?" అంటే "అందులో వింతేముంది. . ఆశ్చర్య పడేదేముంది. . నా రేంజికి ఈ మాత్రం అడగ కూడదా ?" అని మూతి మూడు వంకర్లు తిప్పుతోందిట. కరక్టే దీపం ఉన్నప్పుడే ...అనే సామిత గుర్తు చేసుకుంటున్నారుట అడిగిన వాళ్ళు. అంటే మల్లిక చరిష్మా అంతటిదన్నమాట. ఇంతకు ముందు కూడా మల్లిక ఆప్ కా సరూర్ సినిమాలో కొన్ని సీన్ల కోసం కోటిన్నర వసూలు చేసింది. కాబట్టి నో కామెంట్