సెక్స్ బాంబు ఆఫీసులో రివాల్వర్ పేలుడు..అరెస్టు
బాలీవుడ్ సెక్స్ బాంబు మల్లికా శెరావత్ సోదరుడు విక్రమ్ విక్రమ్ లాంబని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలోని రివాల్వర్ మిస్ పైర్ అవటం ఈ సమస్యను తెచ్చి పెట్టింది. అతను తన రివాల్వర్ ని ముకేష్ భట్ సోదరుడు రాహుల్ భట్ కి చూపుతూండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అతన్ని జైలుకు పంపారు. అతన్ని బెయిల్ పై మంగళ వారం విడుదల చేసారు. పోలీసులు ఆ సమయంలో అక్కడ ఉన్న రాహుల్ స్టేట్ మెంట్ ని తీసుకుని అతన్ని వదిలారు. అలాగే మల్లిక షెరావత్ బెయిల్ పై సంతకం పెట్టి అతన్ని విడిపించుకుంది. ఆమ ఆపీసులోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇక ఆ బుల్లెట్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ అద్దానికి తగిలింది. అక్కడ ఓ స్టూటెండ్ కు అద్దం గ్లాసు ముక్కలు తగలటంతో అతను కేసు పెట్టాడు. ఇక అక్కడ ఉన్న ఆపీసు ఇనిస్టిట్యూట్ ఆప్ పిషరీష్ ఎడ్యుకేషన్.
ఇతరుల క్షేమానికి భగం కలిగించినందుకు మల్లిక సోదరుడుపై కేసు పెట్టారు. ఇక పోలీసులు ఈ కేసులో రాహుల్ భట్ ప్రమేయం ఎంతవరకూ ఉందనేది కూడా విచారించామని చెప్తున్నారు. ఇక ఈ విషయం తమ దృష్టికి వెంటనే తీసుకురానందకు పోలీసలు అతనిపై కూడా కేసు పెట్టేందుకు యోచిస్తున్నామన్నారు. ఇక విక్రమ్ తాను తన రివాల్వర్ ని శుబ్రపరుస్తూండగా పొరపాటున ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అతని పేరున యాభై బుల్లెట్లు రికార్డై ఉన్నాయని,ఇప్పుడు రెండు తక్కువయ్యాయని, అందులో ఒకటి మిస్ పైర్ అయ్యిందని,మిగతా ఏమైందని తేలాలని పోలీసులు అంటున్నారు. అయితే విక్రమ్ తాను ఆ బుల్లెట్ ను రివాల్వర్ కొన్నప్పుడు చెక్ చేయటానికి వాడానని చెప్తున్నారు. పోలుసుల కేసు బుక్ చేసి ధర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











