కత్తిలాగున్న కొత్త ఐటం పాప
బాలీవుడ్ తెరపై మరో కొత్త ఐటం పాప మెరవ బోతోంది. ఇప్పటి వరకు భాలీవుడ్‌లో ఉన్న ఐటం పాపలకు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆమె పేరు మాలికా హెడెన్. సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ జంటగా నటిస్తున్న 'ఏజెంట్ వినోద్' చిత్రంలో ఐటం గర్ల్ గా కనిపించబోతోంది. ఈ చిత్రంలో ఆమె మత్తెక్కించేలా హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ యూత్ మతి పొగొట్టే విధంగా కనిపించనుందట. సినిమా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రష్యన్ నైట్ క్లబ్‌లో ఆమెపై ఐటం సాంగు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఆమెను సినిమాలో ఎంపిక చేసే ముందు సైప్ అలీఖాన్ మాలికా ప్రైవేట్ హాట్ ఫోటో షూట్‌ను, మత్తెక్కించే ఆమె అందాలను చూసి ప్లాట్ అయ్యాడట. మరి ఆమె అందాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. మార్చి 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏజెంట్ వినోద్ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైప్ అలీఖాన్, దినేష్ విజయ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చుతున్నారు. సైఫ్-కరీనా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ్ చోప్రా, రామ్ కపూర్, అదిల్ హుస్సేన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











