నయన్ ఐ లవ్ యూ అంటున్న అజిత్
ఏంటి అజిత్ షాలిని ని పెళ్లి చేసుకొని హాపీగా వుంటే ఇదేంటి అనుకొంటున్నారా, ఇది కేవలం 'మల్లికా ఐ లవ్ యూ' అనే సినిమా వరకే లెండి. నయన్, అజిత్ జంటగా తమిళంలో నటించిన 'ఏగన్' అనే చిత్రాన్ని తెలుగులో 'స్నేహల్ ఇంటర్నేషల్ మువీస్' బ్యానర్ పై 'మల్లికా ఐ లవ్ యూ' అనే పేరు తో అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నృత్యదర్శకుడు రాజుసుందరం దర్శకత్వం వహించారు.ఇందులో టాలీవుడ్ హీరో నవదీప్ ఓ ముఖ్యభూమికను పోషించారు. సుమన్, మలయాళ నటుడు జయరామ్ కీలకపాత్రదారులు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. నయన్ కాలేజీ లెక్చరర్ గా, అజిత్ కాలేజీలో స్టూడెంట్ గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ మొదటి వారంలో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశంవుంది.
More from Filmibeat
ajith nayantara mallika i love you aegan raju sundaram suman jayaram అజిత్ మల్లికా ఐ లవ్ యూ ఏగన్ రాజుసుందరం నవదీప్ సుమన్


Click it and Unblock the Notifications











