అల్లరే అల్లరి, స్టేట్ రౌడీ(శివాజీ హీరో)లతో పరిచయమైన మల్లికా కపూర్ ఇప్పుడు ఐటం సాంగ్స్ కి సైతం సై అంటోంది. హీరోయిన్ గా కెరీర్ ఊహించినంత స్పీడుగా లేక పోవటంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది. అందులోనూ శ్రియ, నయనతార వంటి పాపులర్ హీరోయిన్స్ 'మేము సైతం' ఐటమ్ సాంగ్స్ కి రెడీ అంటూ దూసుకుపోతున్నారు. దాంతో తక్కువ శ్రమ,ఎక్కువ సంపాదన అనే ఈ స్కీమ్ కి మల్లికా కపూర్ సిద్ధం అంటోంది. మరో ప్రక్క చాలా సినిమాల్లో కనిపించిన క్రెడిట్ కూడా దక్కుతుంది. అంతా బాగానే ఉంది గాని ఇలా అందరూ ఈ దారిలోకి వస్తే రెగ్యులర్ ఐటమ్ గర్ల్స్ సంగతేంటి అని కొందరు రియాక్టవుతున్నారు. మరికొందరు ముమైత్ ఖాన్ లాంటి ఐటమ్ గర్ల్స్ హీరోయిన్ రోల్స్ చేయటం లేదా అంటున్నారు. అయినా డ్రస్సుల్లో, డాన్సుల్లో హీరోయిన్స్ కి ఐటమ్ గర్ల్స్ కీ పెద్ద తేడా ఏముంది అంతా ఒకటేగా అంటున్నారు సీనియర్స్. నిజం ప్రేక్షకుడెరుగు అనుకోవాలి.