గత ఏడాది హాట్ హాట్ గా కొనసాగిన మల్లికా షెరావత్ రేటు నూతన సంవత్సరంలో బాగా పడిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. పోయినేడాది ఫైవ్ స్టార్ హోటల్ లో డాన్స్ చేసినందుకుగాను అరకోటి సంపాదించిన మల్లిక ఈ సంవత్సరం కేవలం రూ.40 లక్షలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. పది లక్షల కోతన్నమాట. ఇలా కొత్త సంవత్సరం ఉత్సవాలలో పాల్గొన్నందుకుగాను బిపాషా బసు, మలైకా అరోరాలు అరకోటి సంపాదించగా మల్లికా మాత్రం 40 లక్షలతోనే తృప్తిపడాల్సి వచ్చింది. ఇంతకు వీరు డాన్స్ చేసింది మొత్తంగా ఒక గంట మాత్రమే.