»   » రాహుల్ గాంధీ, మోడీలపై....సెక్సీ మల్లిక ఎకసెక్కాలు!

రాహుల్ గాంధీ, మోడీలపై....సెక్సీ మల్లిక ఎకసెక్కాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై వైపు తన దృష్టి సారించింది. 'ది బ్యాచిలరెట్ ఇండియా-మేరె ఖయాలోంకి మల్లికా' పేరుతో సాగే టీషో ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతోంది. లైఫ్ ఓకె చానల్‌లో అక్టోబర్ 7న ప్రారంభం కానున్న ఈ టీవీ షోకు నటుడు రోహిత్ రాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ టీవి షోతో తన కలల రాకుమారుడు మిస్టర్ రైట్ కోసం అన్వేషణ ప్రారంభించనున్నది ఈ సెక్సీ బ్యూటీ. ఈ షోకు పాపులారిటీ తేవడం కోసం..... బీజేపీ ప్రధాని అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై కామెంట్స్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది మల్లిక.

'పర్ ఫెక్ట్ బ్యాచిలర్ అంటే మోడీనే. ఆయన ఎంతో హాట్. మెడీ అంటే నాకెంతో ఇష్టం. ఆయన కోసం ఏమైనా చేస్తాను. కానీ రాహుల్ గాంధీపై అంతగా ఇంట్రస్టు లేదు' అంటూ కామెంట్స్ చేసింది. మల్లిక ప్రత్యేకంగా వీరిద్దరి గురించే మాట్లాడానికి కారణం పబ్లసిటీ స్టంటే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మరి మల్లికా కామెంట్స్‌పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అంతే కాదు...తాను సినిమా రంగానికి చెందిన వ్యక్తులను వివాహం చేసుకోబోనని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది మల్లికా. 36 ఏళ్ల వయసున్న ఈ సెక్సీ బ్యూటీకి సరైన జోడీ ఎప్పుడు దొరుకుతాడో..? అసలు దొరుకుతాడా!స

English summary
All of sudden, Bollywood actress Mallika Sheravat is all over the internet. This happened after her recent video went viral. We are sure most of you have watched the clip where Mallika sings happy birthday to Gujarat Chief Minister Narendra Modi. Now the actress has come open about her feelings for Modi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu