»   » సెక్స్ బాంబ్ తో రోజంతా గడపటానికి వేలం...

సెక్స్ బాంబ్ తో రోజంతా గడపటానికి వేలం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేటెస్ట్గ్ గా సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ ‌ను కాలిఫోర్నియాలో జరిగిన ఓ వేడుకలో వేలానికి పెట్టారు. 1,400 డాలర్లకు ఓ వ్యక్తి మల్లికాని గెల్చుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ వ్యక్తికి తన టైమ్‌ని కేటాయించారట మల్లికా. ఈ వేలంపాట మల్లికా పూర్తి సమ్మతంతోనే జరిగింది. మల్లికాతో ఒక రోజుంటే మాటలు కాదు కదా..అందుకని భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఈ వేలం పాటలో 'లో నెక్‌' డ్రెస్‌లో మల్లికా మెరిసిపోయింది. ఇంతకీ మల్లికా ఒక రోజంతా అతనితో ఏ విధంగా టైమ్‌ స్పెండ్‌ చేస్తారో తెలిసిందంటే...మధ్యాహ్నం అతనితో కలిసి భోజనం చేస్తుంది. ఆ తర్వాత అతని కోసం ప్రత్యేకంగా ఫొటోషూట్ ‌లో పాల్గొంటుంది. ఆమెతో కలిసి ఆ వ్యక్తి కావల్సినన్ని ఫొటోలు దిగొచ్చట. ఆ తర్వాత అతను కోరినన్ని ఆటో గ్రాఫ్‌లు ఇస్తారు మల్లికా. ఒప్పం దంలో ఉన్నవి ఇవే. వీటి కోసమే అతగాడు 14వందల డాలర్లకు వేలం పాట పాడారు. ఈ డాలర్లు మల్లికా తీసుకోరు అవన్నీ ఓ సేవా సంస్థకు ఇచ్చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu