»   » 'అనార్కలి'గా సెక్స్ బాంబు...

'అనార్కలి'గా సెక్స్ బాంబు...

Posted By: Super
Subscribe to Filmibeat Telugu
తన హాట్ హాట్ అందాలతో అందరినీ ఊరించే మల్లికా షెరావత్ ఇప్పుడు 18వ శతాబ్దం నేపథ్యంలో జరిగే హిస్టారికల్ సినిమాలో చేయబోతోంది. Maan Gaye Mughal-E- Azam  అనే టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమా బాలీవుడ్ క్లాసిక్ 'మొఘల్-ఇ-అజామ్' కి పేరడీట.  ఈ సినిమా మొత్తం   కామిడి తో కడుపుబ్బనవ్విస్తుందిట. ఇందులో   మల్లిక అనార్కలి పాత్రను పేరడీ చేస్తోంది.  కథలో ఆమె చాలా సరదాగా,స్పీడుగా మోడరన్ భావాలు కలిగి ఉండే బేగం.  ఆమె ఓ యూరోపియన్ ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. దాంతో ఆమె ఇస్లామ్ మతం నుండి మారి క్రిష్టినాలిటీ తీసుకుంటుంది.

దాంతో ఆమె తన సమాజం నుండి బంధు వర్గం నుండి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భర్త చనిపోయిన తర్వాత రాజ్యాన్ని ప్రజా రంజకంగా పరిపాలిస్తుంది. అలా ఈ సెక్స్ బాంబ్ ఒ విచిత్రమైన నేటీవ్ టచ్ గల పాత్రను చేస్తోంది. దాంతో ఇన్నాళ్ళూ ఆమెను సెక్సీయిస్ట్ పాత్రలలో ఇష్టంగా చూసిన వాళ్ళకు నచ్చుతుందా అని బాలీవుడ్ సీనియర్లు అనుకుంటున్నారు. కానీ దర్శకుడు Tigmanshu Dhulia మాత్రం ఈ పాత్రకు మల్లిక తప్ప వేరే వారు న్యాయం చేయలేరని అంటున్నాడు. ఇక ఈ చిత్రంలో మల్లిక భర్తగా  John Rhys-Davis అనే నటుడుని ఇంపోర్ట్ చేస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ కాస్టూమ్స్ డ్రామా త్వరలోనే సెట్స్ కెళ్ళే అవకాశం ఉందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X