మల్లికా షెరావత్ కొత్త అవతారం ‘డర్టీ పాలిటిక్స్’(ఫోటో)
ముంబై: మల్లికా షెరావత్ అంటే హాట్ అండ్ సెక్సీగా అందాల ఆరబోత. బికినీలో ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ అభిమానులను మత్తెక్కించే సెక్సీ సెరేన్. వేడి పుట్టించే పడక గది సన్నివేశాల్లో లిప్ లాక్ ముద్దులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే శృంగార తార. చిట్టి పొట్టి డ్రెస్సులో సిగ్గుపడకుండా అంగాంగ ప్రదర్శన. మల్లికా షెరావత్ ఏ సినిమాలోనైనా ఉందంటే సగటు ప్రేక్షకులు సినిమా హాలుకు వెళ్లేది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే.
కానీ తాజాగా మల్లికా షెరావత్ రూటు మార్చింది. వెండి తెరపై సరికొత్త గెటప్ లో కనిపించబోతోంది. ఆమె ప్రస్తుతం కె.సి.బొకాడియా దర్శకత్వంలో రూపొందబోతున్న 'డర్టీ పాలిటిక్స్' చిత్రంలో నటించబోతోంది. ఈ చిత్రంలో సగటు మల్లికా షెరావత్ అభిమానులు కోరుకునే ఎలాంటి గ్లామర్ సొగసులు ఉండవు. ఈచిత్రంలో ఆమె చీరకట్టిలో సగటు భారతీయ మహిళగా కనిపించబోతోంది.
ఈ చిత్రంలో ఆమె గ్యాంగ్ రేప్ బాధితురాలు నర్స్ భన్వరి దేవి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో ఇంకా అనుపమ్ ఖేర్, అశుతోష్ రాణా, జాకీ ష్రాఫ్, ఓంపురి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తిగా రాజకీయాల నేపథ్యంలో సాగనుంది. ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి కుళ్లు రాజ్యమేలుతోంది. రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయి అనే ఇతి వృత్తంతో ఈచిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మరి మల్లికా కొత్త అవతారం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో..?
హాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్న మల్లికా షెరావత్ ఈ మధ్య అమెరికాలోనే ఎక్కువగా గడుపుతోంది. అయితే ఆమెకు అంతగా ఫలించడం లేదు. దీంతో ఇటు బాలీవుడ్ సినిమా ప్రాజెక్టులకు సైతం ఒప్పుకుంటూ సంపాదనకు డోకా లేకుండా చూసుకుంటోంది.


Click it and Unblock the Notifications












