బాలీవుడ్ లో సెక్స్ బాంబ్ గా పేరు గాంచిన మల్లికా శెరావత్ తాజాగా ఓ అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుని అందరినీ విస్మయంలో ముంచేసింది. దాంతో వారంతా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. కానీ మల్లికా శెరావత్ మాత్రం దీనికి విరుద్ధమని నిరూపించిందంటున్నారు. ముందు హాలీవుడ్‌లో పేరు తెచ్చుకొనే ప్రయత్నాల్లో ఉంది. బాలీవుడ్‌లో అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నా.. హాలీవుడ్‌లో ఈమెకు ఆదరణ బాగానే ఉంది. మల్టీకల్చరల్ మోషన్ పిక్చర్ అసోసియేషన్స్ డైవర్సిటీ వారు అందించే రినైస్సాన్స్ ఆర్టిస్టు అవార్డును 2008 ఏడాదికిగానూ ఈమె అందుకోబోతోంది. ఆమె మాట్లాడుతూ ''ఓ భారతీయ నటి హాలీవుడ్‌లో అవార్డు తీసుకోవడం ఎలా ఉందంటే.. వైట్ హౌస్‌లో ఓ అందమైన నల్లజాతి అధ్యక్షుడు కూర్చున్నట్టుగా ఉంది. గతంలో ఈ అవార్డును సల్మా హయక్, హాలీ బెర్రీ, మోనికా బెలూచీ తీసుకున్నారు. ఇప్పుడు వారి సరసన నేను నిలవడం ఆనందంగా ఉంద''న్నారు. గ్రేట్ కదా.