బాలీవుడ్ శృంగార తార మల్లికాశెరావత్ కు 1564 సంఖ్యతో విడదీయలేని అనుబంధమే ఉంది. ఈ విషయాన్నే ఆమె ఇటీవల తానే స్వయంగా మీడియాకు వెళ్ళడించింది. "నాకు ప్రెండ్ షిప్ విలువ తెలుసు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ స్నేహంగానే చూస్తాను. ఇప్పటి వరకు నాకున్న స్నేహితులు ఎంతమందో అక్షరాలా 1564. ఈ సంఖ్య పెరిగే కొద్దీ నా శ్రేయోభిలాషులు పెరుగుతున్నట్టే లెక్క వేసుకుంటాను. సినిమా రంగంలో ముఖ్యంగా రాఖీ సావంత్, కత్రిన, దియామీర్జా, ప్రియాంకా చోప్రా నా సన్నిహితులు. కనిపిస్తే మాట్లాడటం కాదు..ప్రత్యేకంగా ఫోన్లు చేసి మాట్లాడుకుంటాం.." అంటూ వివరించింది మల్లికా శెరావత్.