హైదరాబాదులో మల్లికా షెరావత్ హల్ చల్
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ శనివారం హైదరాబాదులో హల్ చల్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాదు వచ్చిన మల్లికా షెరావత్ తాజ్ కృష్ణాలో హిస్..స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆమె సరసన ఇర్ఫాన్ ఖాన్ నటించారు. సినిమాలో నాగినిగా నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. పాము పగ తీర్చుకునే ముందు...అంటూ తెలుగులో మాట్లాడి అలరించారు. పాము బొమ్మతో ఫొటోలకు ఫోజులిచ్చారు. హిస్..స్ సినిమాలో మల్లికా షెరావత్ నాగుపామును ముద్దు పెట్టుకునే దృశ్యం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











