twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికా శరావత్ లేటెస్ట్ చిత్రం ' హిస్' కధ ఇదే

    By Srikanya
    |

    సెక్స్ బాంబ్ మల్లికా శరావత్ తాజా 'హిస్' అనే చిత్రంతో చేసింది. ఈ చిత్రం తెలుగులో డబ్బింగై ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ సందర్బంగా తెలుగులో విడుదల చేస్తున్న ఈ చిత్రం కథ ఏమిటన్నది అందరికీ ఆసక్తికరమే. కథ ప్రకారం...మన భారతీయులంతా..నాగు పాముని దైవంలా భావించి పూజిస్తూంటాం. అలాగే పిల్లలు పుట్టాలన్నా పాము పూజలు తప్పని సరి. అందులోనూ సింధూనది తీరంలో నివసించే వారికి ఈ నమ్మకాలు మరీ ఎక్కువ అనే వాయిస్ ఓవర్ తో చిత్రం ప్రారంభమవుతుంది. సింధూనది తీరంలో సగం మనిషి, సగం పాము శరీరం కలిగిన జీవులు సంచరించేవారని అక్కడ ప్రచారంలో ఉంది.

    ఇవన్నీ విన్న జార్జి అనే విదేశీయుడు...2008లో ఈ నమ్మకాలను మూఢ నమ్మకాలుగా కొట్టిపారేస్తూ...అది నిరూపించాలని, మలబార్ దీవుల్లోకి వచ్చి తనకు ఎదురైన ఓ మగపాముని క్రూరంగా చంపేస్తాడు. ఆ సమయంలో ఆ మగపాము, మరో ఆడపాముతో సంగమంతో ఉంటుంది. దాంతో మిగిలి ఉన్న ఆడ పాము జార్జిపై పగబడుతుంది. ఈ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా కథనం. ఇక ఈ సినిమాలో పగ బట్టే నాగిని పాత్రలో మల్లిక షెరావత్ నటించింది. ఈ చిత్రంలో మల్లిక..నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అన్నట్లు సాగుతుంది. హిస్ చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది ఆ చిత్ర దర్శకురాలు జెన్నిఫర్ లిచ్. అయితే మల్లికా లాంటి సెక్స్ బాంబ్ లకు మాటలతో పనేముంటుంది. చూపులు...చేష్టలు చాలు కదా. ఈ భారీ థ్రిల్లింగ్ స్నేక్ పిక్చర్‌ను చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X