Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మల్లికా శరావత్ లేటెస్ట్ చిత్రం ' హిస్' కధ ఇదే
సెక్స్ బాంబ్ మల్లికా శరావత్ తాజా 'హిస్' అనే చిత్రంతో చేసింది. ఈ చిత్రం తెలుగులో డబ్బింగై ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ సందర్బంగా తెలుగులో విడుదల చేస్తున్న ఈ చిత్రం కథ ఏమిటన్నది అందరికీ ఆసక్తికరమే. కథ ప్రకారం...మన భారతీయులంతా..నాగు పాముని దైవంలా భావించి పూజిస్తూంటాం. అలాగే పిల్లలు పుట్టాలన్నా పాము పూజలు తప్పని సరి. అందులోనూ సింధూనది తీరంలో నివసించే వారికి ఈ నమ్మకాలు మరీ ఎక్కువ అనే వాయిస్ ఓవర్ తో చిత్రం ప్రారంభమవుతుంది. సింధూనది తీరంలో సగం మనిషి, సగం పాము శరీరం కలిగిన జీవులు సంచరించేవారని అక్కడ ప్రచారంలో ఉంది.
ఇవన్నీ విన్న జార్జి అనే విదేశీయుడు...2008లో ఈ నమ్మకాలను మూఢ నమ్మకాలుగా కొట్టిపారేస్తూ...అది నిరూపించాలని, మలబార్ దీవుల్లోకి వచ్చి తనకు ఎదురైన ఓ మగపాముని క్రూరంగా చంపేస్తాడు. ఆ సమయంలో ఆ మగపాము, మరో ఆడపాముతో సంగమంతో ఉంటుంది. దాంతో మిగిలి ఉన్న ఆడ పాము జార్జిపై పగబడుతుంది. ఈ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా కథనం. ఇక ఈ సినిమాలో పగ బట్టే నాగిని పాత్రలో మల్లిక షెరావత్ నటించింది. ఈ చిత్రంలో మల్లిక..నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అన్నట్లు సాగుతుంది. హిస్ చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది ఆ చిత్ర దర్శకురాలు జెన్నిఫర్ లిచ్. అయితే మల్లికా లాంటి సెక్స్ బాంబ్ లకు మాటలతో పనేముంటుంది. చూపులు...చేష్టలు చాలు కదా. ఈ భారీ థ్రిల్లింగ్ స్నేక్ పిక్చర్‌ను చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.