»   » శృంగార తార సినిమాలు ఎంజాయ్ చేస్తాడట, మల్లికతో ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్!

శృంగార తార సినిమాలు ఎంజాయ్ చేస్తాడట, మల్లికతో ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ శృంగార తార మల్లికా శరావత్ కు పలువురు అంతర్జాతీయ బిగ్ సెలెబ్రిటీలు లతో సాన్నిహిత్యం ఉంది. జాకీచాన్, బరాక్ ఒబామా మరియు బిల్ గేట్స్ వంటి వారితో మల్లికకు పరిచయం ఉంది. తాజాగా మరో ఇంటర్నేషనల్ సెలబ్రిటిని మల్లికా కలుసుకుంది. ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గులెర్మో డెల్ టోరో హాట్ టాపిక్ గా మారారు. ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రానికి గాను టోరో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు అందుకుంది. ఈ దర్శకుడిని శృంగార తార మల్లికా శరావత్ కలుసుకుంది.

 ఉత్తమ చిత్రం

ఉత్తమ చిత్రం

ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డులలో హాలీవుడ్ చిత్రం ది షేప్ ఆఫ్ వాటర్ అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. అమెరికా, రష్యా మధ్య అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో కృత్రిమంగా సృష్టించబడ్డ ఉభయచరానికి, ఓ అమ్మాయికి మధ్య ప్రేమ కథగా సాగుతుంది ఈ చిత్రం.

 ఉత్తమ దర్శకుడు

ఉత్తమ దర్శకుడు

ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రాన్ని ఓ కళా ఖండంగా తీర్చిదిద్దిన దర్శకుడు టోరో అత్యుత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గెలుపొందాడు. ప్రపంచ వ్యాప్తంగా టోరో ఇప్పుడు సంచనలంగా మారాడు.

టోరోని కలుసుకున్న శృంగార తార

టోరోని కలుసుకున్న శృంగార తార

బాలీవుడ్ శృంగార తార మల్లికా శరావత్ తాజాగా టోరోని కలుసుకుంది. టోరోని కలుసుకోవడం ద్వారా తన కల నిజమైందని మల్లికా చెబుతోంది.

 ఆ చిత్రంతోనే అభిమానం మొదలైంది

ఆ చిత్రంతోనే అభిమానం మొదలైంది

తనకు టోరోపై ఆయన తెరకెక్కించిన పాన్స్ లాబిరింత్స్ చిత్రంతోనే అభిమానం ఏర్పడిందని మల్లికా చెబుతోంది. ఇటీవల తాను షేప్ అఫ్ వాటర్ చిత్రం చూశానని, ఆ చిత్రం తన ఫేవరేట్ మూవీగా మారిపోయిందని మల్లికా ఈ దర్శకుడిపై ప్రశంసలు కురిపించింది.

అతడి భార్య ద్వారా

అతడి భార్య ద్వారా

తన భార్య వలన తాను బాలీవుడ్ చిత్రాలని చూడడం ప్రారంభించానని టోరో తెలిపాడు. తన భార్య బాలీవడ్ చిత్రాలని, అందులోని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుందని తెలిపాడు.

అతడి భార్య ద్వారా

అతడి భార్య ద్వారా

తన భార్య వలన తాను బాలీవుడ్ చిత్రాలని చూడడం ప్రారంభించానని టోరో తెలిపాడు. తన భార్య బాలీవడ్ చిత్రాలని, అందులోని మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తుందని తెలిపాడు.

టోరో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు

టోరో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు

తాను కూడా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలని చూస్తునాన్ని టోరో వివరించాడు. మల్లికా శరావత్ చిత్రాలని ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. బాలీవుడ్ చిత్రాలలోని సంగీతం నృత్యాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని వివరించాడు. తాను బాలీవుడ్ చిత్రం చేస్తే మంచి మ్యూజికల్ సినిమా చేస్తానని తెలపడం విశేషం.

English summary
Mallika Sherawat meets Oscar winning director guillermo del toro. She watched The shape of water movie and loved it
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu