సెక్స్ బాంబ్ మల్లిక ఈ సారి ఫుల్లుగా...!
మర్డర్ సినిమా ద్వారా తన హాట్ పెర్ఫార్మెన్స్, లిప్ కిస్ సీన్లు, సిగ్గు అనే పదమే మరిచి పోయి అందాల ఆరబోతతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తార మల్లికా షెరావత్. ఆ తర్వాత కొంత కాలం పాటు బాలీవుడ్ జనాలకు తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ తార హిస్ సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టింది. హిస్ తర్వాత కస్సుమని పైకిలేస్తుందనుకున్న మల్లికా ఒక్కసారిగా తుస్సుమనేసరికి కొంతకాలం ఐటం సాంగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మల్లిక మాత్రం అవకాశాల్ని వదులు కోకుండా ఐటం సాంగ్స్‌లోనూ తనదైన హవా కొనసాగించడంతో....దక్షిణాది చిత్రాల్లో కూడా ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు.
మర్డర్ సినిమా తెచ్చిన పేరు మరోసారి సొంతం చేసుకోవడానికి....మర్డర్-2లో నటించడానికి తహతహలాడిన మల్లికకు చివరకు ఆశా భంగమే ఏర్పడింది. నిర్మాత మహేష్ భట్ మల్లికను కాదని జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ను తీసుకున్నాడు. ఆ సినిమాలో మల్లిక లేని లోటు స్పష్టంగా కనిపించింది. మల్లిక అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. కానీ ఏం లాభం..
అయితే మల్లిక ఇప్పుడు తాజాగా మరో సువర్ణావ కాశం వచ్చింది. మళ్లీ తన స్టార్ ఇమేజ్ పెంచుకునే గొప్ప అవకాశం. హీరోయిన్ గా రానించే సూపర్ ఛాన్స్. అదేమిటంటే....వివేక్ ఒబెరాయ్‌తో కలిసి ఓ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం దక్కింది ఈ భామకు. బాలీవుడ్ శృంగార ప్రియులు మల్లికను ఫుల్లుగా సినిమా మొత్తం చూడాలని, ఆమె అందాల ఆరబోత సన్నివేశాలను చూసి తరించాలని ఎన్నాళ్లగానో నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ల ఆ..శ తీరే సమయం ఆసన్నమైంది.
మల్లిక నటించబోయే ఆ సినిమా పేరు 'కిస్మత్ లవ్ పైసా ఢిల్లీ'. ఈ చిత్రానికి సంజయ్ కందూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మల్లిక హర్యానా అమ్మాయిగా, వివేక్ ఒబెరాయ్ ఢిల్లీ కుర్రాడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మల్లికను హాట్ హాట్ గా నటింప చేయనున్నారని, ఇద్దరి మధ్య కైపెక్కించే ముద్దు సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.


Click it and Unblock the Notifications











