మల్లిక మేకప్ మేన్ ఖరీదు రూ. 70 లక్షలు
బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఇప్పటికే తన అందాలతో యూత్ కు నిద్రలేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఆమె అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపించనున్నాయి. ప్రస్తుతం మల్లిక నటిస్తున్న 'కిస్మత్ లవ్ పైసా దిల్లి' అనే చిత్రానికి గాను మల్లిక కోసం హాలీవుడ్ నుంచి మేకప్ మేన్ ను రప్పించారు. అతని పేరు జెఫ్రీ పాల్. హాలీవుడ్ లో ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్. సినిమా షూటింగులో భాగంగా 70 రోజుల పాటు మల్లికకు జెఫ్రీ మేకప్ వేయాల్సి ఉంది. ఇందుకోసం రోజుకు లక్ష చొప్పున మొత్తం 70 లక్షల అతనికి చెల్లిస్తున్నారట నిర్మాతలు.
మామూలు మేకప్ మేన్లు మల్లిక అందాలకు మెరుగులు దిద్దితేనే ఓ రేంజ్ లో ఉంటాయి...ఇంత ఖర్చు పెట్టి హాలీవుడ్ నుంచి రప్పించిన వ్యక్తి ఏ మేరకు అతని పనితనం చూపిస్తాడో చూడాలి.
ఈ చిత్రానికి సంజయ్ కందూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మల్లిక హర్యానా అమ్మాయిగా, వివేక్ ఒబెరాయ్ ఢిల్లీ కుర్రాడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మల్లికను హాట్ హాట్ గా కనిపించనుంది. గత కొంత కాలంగా ఐటం సాంగులకే పరిమితం అయిన మల్లిక చాలా రోజుల తర్వాత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











