పెళ్లిపై మల్లికా షెరావత్ షాకింగ్ స్టేట్ మెంట్
మర్డర్ సినిమా ద్వారా తన హాట్ పెర్ఫార్మెన్స్, లిప్ కిస్ సీన్లు, సిగ్గు అనే పదమే మరిచి పోయి అందాల ఆరబోతతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తార మల్లికా షెరావత్. ఆ తర్వాత కొంత కాలం పాటు బాలీవుడ్ జనాలకు తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.
హిస్ సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టిన మల్లికా.... హిస్ తర్వాత కస్సుమని పైకిలేస్తుందనుకున్నా ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఒక్కసారిగా తుస్సుమనేసరికి కొంతకాలం ఐటం సాంగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మల్లిక మాత్రం అవకాశాల్ని వదులు కోకుండా ఐటం సాంగ్స్‌లోనూ తనదైన హవా కొనసాగించడంతో....దక్షిణాది చిత్రాల్లో కూడా ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే హాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిన మల్లికా అక్కడి సినీ జనాలను ఆకర్షించడానికి 'గే'స్నేహితులకు పార్టీలు గట్రా ఇస్తూ అక్కడ పబ్లిసిటీ పెంచుకుంటోంది.
ప్రస్తుతం మల్లికా శెరావత్ మూడు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తేజ్ అనే చిత్రంలో స్పెషల్ ఐటం సాంగులో నర్తించనుంది. కిస్మిత్ పైసా ఢిల్లీ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంజయ్ కందూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మల్లిక హర్యానా అమ్మాయిగా, వివేక్ ఒబెరాయ్ ఢిల్లీ కుర్రాడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మల్లికను హాట్ హాట్ గా నటింప చేయనున్నారని, ఇద్దరి మధ్య కైపెక్కించే ముద్దు సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.


Click it and Unblock the Notifications












