సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ తెలుగు చిత్రం
తాజాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఓ తెలుగు చిత్రంలో చేయటానికి ఓకే చేసింది. కాంటాక్ట్ టైటిల్ తో నిర్మితమయ్యే ఈ చిత్రంలో జెడి చక్రవర్తి, అర్జున్ హీరోలుగా చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటి అమీషాపటేల్ కూడా ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సమీర్ అనే కొత్త దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. అక్టోబర్ 12 నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. బాలీవుడ్ కెమెరా మెన్ జానీ లాల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇండియాతో పాటు విదేశాలలో ఈ చిత్రం షూటింగ్ చేస్తామని, యాక్షన్ ప్యాక్‌డ్ ప్రేమకథాచిత్రమిదని దర్సకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











