ఊహించినట్లే మల్లికా షెరావత్ ఇరుక్కుంది
హైదరాబాద్: అనుకున్నట్లే అయ్యింది. ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కోర్టుకేసులో ఇరుక్కుంది. చిత్రం పోస్టర్ విడుదైన రోజే ఇలాంటి కాంట్రావర్శి జరుగుతుందని భావించారు. అదే నిజమై ఆమెకు ఈ రోజు(సోమవారం) కోర్టు నోటీసులు జారీ చేసింది. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ లో జాతీయ జెండాను అవమాన పరిచారని పిటీషన్ ఆమెపై దాఖలైంది. దాంతో ఆ పిటీషన్ పై స్పందించిన న్యాయ స్దానం..చిత్రం నిర్మాతతో పాటు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లకు కూడా నోటీసులు జారిచేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో బుధవారం పిల్ దాఖలైంది. ఇటీవల మల్లికా షెరావత్ నటించిన దర్టీ పాలిటిక్స్ చిత్రంలో ఆమె తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని ఉన్న ఫోటో ఫోజులను సినిమా యూనిట్ విడుదల చేసింది. దీంతో త్రివర్ణపతాకాన్ని అవమానించారంటూ మానవ హక్కుల కార్యకర్త గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జాతీయ జెండాను అవమానించిన దర్టీ పాలిటిక్స్ నిర్మాత దత్తూర్ చంద్ బొకాడియా, నటి మల్లికాషెరావత్‌పై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పోస్టర్లను తొలగించి, సినిమా నుంచి ఈ సన్నివేశాలను కత్తిరించాలంటూ గోపాల్‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది.

మర్డర్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ భాగానే సాగినా ప్రస్తుతం మాత్రం ఏమంత సంతృప్తి కరంగా లేదు. ఈ నేపధ్యంలో ఆమె కాంట్రావర్శి ఉన్న సబ్జెక్టులతో ముందుకు రావాలనే నిర్ణయం తీసుకుంది.
మల్లిక ...రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ 'డర్టీ పాలిటిక్స్'. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.
ఇంతకుముందు మల్లికా శరావత్ ఎప్పుడూ ఏదో ఒక న్యూసెన్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచేది. కానీ ఇప్పుడు టచ్‌లోనే లేదు. ఇటీవలి కాలంలో మీడియాకి అమ్మడు పూర్తిగా దూరమైపోయింది. చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఈవిడని అంతా మర్చిపోయారు. అప్పట్లో హిస్ సినిమా టైమ్‌లో ప్రమోషన్ కోసం ముంబై, హైదరాబాద్, గోవా అంటూ అన్నిచోట్లా తిరిగింది. అప్పుడు మీడియా అంతా ఈవిడ వెంట తిరిగింది. ఇప్పుడామెను పట్టింకునే వారే కరువయ్యారు. అందుకే ఇలాంటి పోస్టర్స్ .


Click it and Unblock the Notifications











