నడుం బిగించిన మల్లికా షెరావత్.. అదొక్కటే కాదు ఇందులోనూ ముందే!
ఇటీవలి కాలంలో సామాజిక అంశాలపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలో సామాజిక సేవ కోసం తమ వంతు సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక సేవలు చేస్తూ తమ లోని మానవతా హృదయాన్ని చాటుకుంటున్న సెలెబ్రిటీలు ఎందరో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ చేరిపోయింది.
బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన మల్లికా షెరావత్ సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఆసక్తి చూపుతోంది. సామాజిక సేవలో తరించిపోవాలని నడుం బిగించిన ఈ అమ్మడు రోటరీ ఇంటర్నేషనల్ అనే సామాజిక సేవా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చేసింది. దేశంలో పోలియోను అరికట్టేందుకు గాను రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ పోలియో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రచార కర్తగా హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ వ్యవహరిస్తుండటం ఆసక్తికర అంశం. మల్లికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భేష్ అంటున్నారు సినీ ప్రముఖులు.

2004 సంవత్సరంలో 'మర్డర్' చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమైంది మల్లిక. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రాల్లోనూ అడుగుపెట్టిన మల్లికా అక్కడ కూడా టాలెంట్ చూపించింది. వీటన్నింటి మించి ఐటెం సాంగ్స్ ద్వారా మల్లికకు భారీ క్రేజ్ లభించింది. కాగా తనను కొంతమంది హీరోలు కావాలనే తొక్కేశారని ఇటీవల ఆరోపించింది మల్లిక షెరావత్. తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదని గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో తనకు 'బోల్డ్ నటి' అని పేరు రావడానికి తోటి నటీనటులే కారణమని పేర్కొంది మల్లికా షెరావత్.


Click it and Unblock the Notifications











