twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికాకు చేదు అనుభవం.. ఇంటి నుంచి గెంటివేత.. టాయిలెట్‌పై ఏంటీ?

    By Rajababu
    |

    Recommended Video

    మల్లికాకు చేదు అనుభవం.. ఇంటి నుంచి గెంటివేత..!

    సోషల్ మీడియా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారల వ్యక్తిగత ఇష్టాలకు కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లలో అభిమానులు ఫాలో అవుతున్న క్రమంలో సినీ స్టార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తున్నది. ఏ మాత్రం ఎక్స్‌ట్రా అనిపించినా మొహమాటం లేకుండా అడ్డదిడ్డమైన కామెంట్లతో పరువుతీస్తున్నారు. ఇలాంటివేమీ పట్టించుకోని సెక్స్‌బాండ్ మల్లికా షెరావత్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మీరే చూడండి..

     కామెంట్లతో మల్లికాపై ట్రోల్

    కామెంట్లతో మల్లికాపై ట్రోల్

    మల్లికా షెరావత్ పొద్దునే లేచి గోడ పక్కకు తీరికగా కూర్చొని ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక చెప్పాల్సిందేముంది. నెటిజెన్లు నోటికి వచ్చినట్టు వాగారు. అడ్డదిడ్డమైన కామెంట్లతో మల్లికాను రఫ్ ఆడించారు. ఇంతకీ మల్లికాను ఎలాంటి సూటిపోటి మాటలతో కుళ్ల పొడిచారంటే..

     టాయిలెట్‌పై రిలాక్స్ అవుతున్నావా?

    టాయిలెట్‌పై రిలాక్స్ అవుతున్నావా?

    నీవు కూర్చున్న పొజిషన్ చూస్తుంటే టాయిలెట్ మీద రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తున్నది. నిన్ను చేస్తే ఆస్ట్రిచ్ పక్షిలా కనిపిస్తున్నావు అని కామెంట్లతో మల్లికాను ఇరగదీశారు. మరో వ్యక్తి అయితే ఆంటీ అంటూ సంబోధిస్తూ సెటైర్లు వేశాడు..

     మల్లికా చెత్త ఫోటోషూట్

    మల్లికా చెత్త ఫోటోషూట్

    మల్లికా నీవు అంత పొద్దున్నే దేనికోసం చూస్తున్నావు. నీ ఫొటో చేస్తూ అదో చెత్త ఫొటోషూట్ అనిపిస్తున్నది అని మల్లికాకు కామెంట్లు విసిరారు. ఇలా ఫొటో కింద చాలా రకాల కామెంట్లతో విసిగించారు. చివరికి చేసేది ఏమీ లేక ఆ ఫోటోను మల్లికా తొలగించాల్సి వచ్చింది.

     మల్లికాకు మరో చేదు అనుభవం

    మల్లికాకు మరో చేదు అనుభవం

    ఇదిలా ఉంటే.. మల్లికాకు మరో చేదు ఘటన ఎదురైంది. ప్యారిస్‌లో మల్లికా షెరావత్ తన స్నేహితుడు ఆక్సెన్‌ఫ్యాన్స్‌తో ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నది. అయితే ఆ ఆపార్ట్‌మెంట్ అద్దె చెల్లించలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారటనేది ఫ్రెంచ్ పత్రికల కథనం. దాదాపు 60 లక్షల రూపాయల అద్దె బాకీ ఉన్నట్టు కథనాల్లో పేర్కొన్నారు.

     మల్లికా ఖండన

    మల్లికా ఖండన

    అయితే ఇంటి నుంచి వెళ్లగొట్టారని వచ్చిన వార్తలను మల్లికా షెరావత్ ఖండించింది. నేను ఎవరికీ అద్దె బాకీ పడలేదు. ఈ అంశంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఇలాంటి విషయాలను తానేమీ పట్టించుకొను అని మల్లికా వెల్లడించింది.

    మల్లికకు ఆర్థిక ఇబ్బందులు

    మల్లికకు ఆర్థిక ఇబ్బందులు

    కాగా, మల్లికాకు సంబంధించిన మరో వార్తను బీబీసీ ప్రసారం చేసింది. మల్లికా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది అని కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం యాక్షన్ అడ్వెంచర్ చిత్రం టైమ్ రైడర్స్ నటిస్తున్నది.

    English summary
    Mallika Sherawat was trolled after she shared a sultry snap on Instagram. While one user likened her to an ostrich, others said that it looked like she was sitting on the toilet. Mallika is currently in the news for defaulting on the rent of her Paris apartment, which she shares with her French beau, Auxenfans. Apparently, she has stacked up almost Rs 64 lakh in rent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X