Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మల్లికాకు చేదు అనుభవం.. ఇంటి నుంచి గెంటివేత.. టాయిలెట్‌పై ఏంటీ?
Recommended Video
సోషల్ మీడియా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారల వ్యక్తిగత ఇష్టాలకు కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభిమానులు ఫాలో అవుతున్న క్రమంలో సినీ స్టార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తున్నది. ఏ మాత్రం ఎక్స్ట్రా అనిపించినా మొహమాటం లేకుండా అడ్డదిడ్డమైన కామెంట్లతో పరువుతీస్తున్నారు. ఇలాంటివేమీ పట్టించుకోని సెక్స్బాండ్ మల్లికా షెరావత్కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మీరే చూడండి..
కామెంట్లతో మల్లికాపై ట్రోల్
మల్లికా షెరావత్ పొద్దునే లేచి గోడ పక్కకు తీరికగా కూర్చొని ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక చెప్పాల్సిందేముంది. నెటిజెన్లు నోటికి వచ్చినట్టు వాగారు. అడ్డదిడ్డమైన కామెంట్లతో మల్లికాను రఫ్ ఆడించారు. ఇంతకీ మల్లికాను ఎలాంటి సూటిపోటి మాటలతో కుళ్ల పొడిచారంటే..
టాయిలెట్‌పై రిలాక్స్ అవుతున్నావా?
నీవు కూర్చున్న పొజిషన్ చూస్తుంటే టాయిలెట్ మీద రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తున్నది. నిన్ను చేస్తే ఆస్ట్రిచ్ పక్షిలా కనిపిస్తున్నావు అని కామెంట్లతో మల్లికాను ఇరగదీశారు. మరో వ్యక్తి అయితే ఆంటీ అంటూ సంబోధిస్తూ సెటైర్లు వేశాడు..
మల్లికా చెత్త ఫోటోషూట్
మల్లికా నీవు అంత పొద్దున్నే దేనికోసం చూస్తున్నావు. నీ ఫొటో చేస్తూ అదో చెత్త ఫొటోషూట్ అనిపిస్తున్నది అని మల్లికాకు కామెంట్లు విసిరారు. ఇలా ఫొటో కింద చాలా రకాల కామెంట్లతో విసిగించారు. చివరికి చేసేది ఏమీ లేక ఆ ఫోటోను మల్లికా తొలగించాల్సి వచ్చింది.
మల్లికాకు మరో చేదు అనుభవం
ఇదిలా ఉంటే.. మల్లికాకు మరో చేదు ఘటన ఎదురైంది. ప్యారిస్‌లో మల్లికా షెరావత్ తన స్నేహితుడు ఆక్సెన్ఫ్యాన్స్తో ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నది. అయితే ఆ ఆపార్ట్మెంట్ అద్దె చెల్లించలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారటనేది ఫ్రెంచ్ పత్రికల కథనం. దాదాపు 60 లక్షల రూపాయల అద్దె బాకీ ఉన్నట్టు కథనాల్లో పేర్కొన్నారు.
మల్లికా ఖండన
అయితే ఇంటి నుంచి వెళ్లగొట్టారని వచ్చిన వార్తలను మల్లికా షెరావత్ ఖండించింది. నేను ఎవరికీ అద్దె బాకీ పడలేదు. ఈ అంశంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ఇలాంటి విషయాలను తానేమీ పట్టించుకొను అని మల్లికా వెల్లడించింది.
మల్లికకు ఆర్థిక ఇబ్బందులు
కాగా, మల్లికాకు సంబంధించిన మరో వార్తను బీబీసీ ప్రసారం చేసింది. మల్లికా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది అని కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం యాక్షన్ అడ్వెంచర్ చిత్రం టైమ్ రైడర్స్ నటిస్తున్నది.