twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార సీన్లు: ఆయనతో ఇబ్బంది పడ్డానన్న మళ్లిక షెరావత్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ఉదంటే....ఆ సినిమాలో ఘాటైన శృంగార సన్నివేశాలు ఉంటాయని ఆశించి వెళతారు. అలాంటి సీన్ల విషయంలో అంతలా పాపుల్ అయింది మల్లికా. అందుకే ఆమెను చాలా మంది సెక్స్ బాంబ్ అని పిలుస్తుంటారు. అలాంటి మల్లికా షెరావత్ తాజాగా ‘డర్టీ పాలిటిక్స్' సినిమాలో శృంగార సన్నివేశాలు చేసేప్పుడు ఇబ్బంది పడిందట.

     Mallika Sherawat: Was Uncomfortable Doing Bold Scenes With Om Puri

    ఈ చిత్రంలో తన పాత్ర గురించి మల్లిక చెబుతూ...‘తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి ఒక మహిళ జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నా పాత్ర పేరు అనోఖి దేవి. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడే మహిళ పాత్ర అది' అని మల్లిక చెప్పుకొచ్చింది.

    ఆమె ఇబ్బంది పడటానికి కారణం సీనియర్ నటుడు ఓంపురితో కలిసి ఆ సీన్లు చేయాల్సి రావడమే. ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్వయంగా వెల్లడించారు. ఓంపురిగారు నాకంటే పెద్ద వారు. ఆయనతో అలాంటి సీన్లు చేసేప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఆయన ఎంతో సపోర్టు ఇచ్చారు అని మల్లిక చెప్పుకొచ్చింది.

     Mallika Sherawat: Was Uncomfortable Doing Bold Scenes With Om Puri

    తన క్యారెక్టర్ గురించి మరింత లోతుగా చెబుతూ...‘ఆమె ఒక పేద కుటుంబం నుండి వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఆమెను మోహిస్తాడు. అదే అదునుగా ఆమె తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి అతని వశం చేసుకుని తాను అనుకున్నది సాధించడానికి ఏం చేసింది' అనేది డర్టీ పాలిటిక్స్ సినిమా అని తెలిపారు. ఈ చిత్రానికి కెసి. బోకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఓంపురి నటిస్తున్నారు. ఆ మధ్య సంచలనం సృష్టించిన భన్వరీదేవి సెక్స్ స్కాండల్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.

    English summary
    Actress Mallika Sherawat has done bold scenes for various films in the past, but she says she was not at ease performing bold sequences with veteran actor Om Puri in Dirty Politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X