రజనీకాంత్‌నూ..ముగ్గులోకి లాగిన సెక్స్ బాంబ్
ముంబై: తనకు తగిన జోడీ వెతుక్కోవడం కోసం బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ 'ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోన్ కి మల్లికా' అనే రియాల్టీ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ షోకు పబ్లిసిటీ కల్పించు కోవడం కోసం మల్లిక తనదైన విధానాన్ని అనుసరిస్తోంది.
ఇప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిని నరేంద్రమోడీని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఆయన చాలా హాట్‌గా ఉంటారు, నాకు ఎంతో ఇష్టం....రాహుల్ గాంధీ అంటే ఇంట్రస్టు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్....తాజాగా తన గురి సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వైపు పెట్టింది.
'రజనీకాంత్‌తో ఎవరూ లేని ద్వీపంలో ఒంటరిగా సంచరించాలని ఉంది. ఆయన ఉంటే నేను అస్సలు బోర్ ఫీల్ కాను. ఆయన నన్ను నిర్విరామంగా వినోదపరుస్తారు. నేను ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్షణాల్లో తీసుకెళతాడు' అంటూ వ్యాఖ్యానించింది మల్లికా షెరావత్.
అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షాలలో మీరు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అని అడిగిన ప్రశ్నికు మల్లికా షెరావత్ సమాధానం ఇస్తూ...'అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ఆయనంటే గౌరవం. నసీరుద్దీన్ షా అంటే కూడా చాలా ఇష్టం. ఆయనతో కలిసి 'డర్టీ పాలిటిక్స్' చిత్రంలో నటించాను. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి' అని చెప్పుకొచ్చంది మల్లిక.
'ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోన్ కి మల్లికా' రియాల్టీషో లైఫ్ ఓకే ఛానల్లో అక్టోబర్ 7న ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ షోలో 18 మంది పోటీదారులు ఉన్నారు. వారు మల్లికను మెప్పించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. చివరకు మల్లికకు తగిన జోడీ అని నిరూపించుకునేది ఎవరో?


Click it and Unblock the Notifications











